జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోందా?

తెలంగాణలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని అప్పట్లోనే వాదనలు వచ్చాయి.

Update: 2024-03-27 06:37 GMT

తెలంగాణలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని అప్పట్లోనే వాదనలు వచ్చాయి. కేసీఆర్ ఒంటెత్తు పోకడ వల్ల ఇబ్బడిముబ్బడిగా జిల్లాలు పుట్టుకొచ్చాయి. అడిగిన వాటిని కాకుండా అడగని వాటిని కూడా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పరిపాలన భారాన్ని తేలికగా చేశామని చెప్పుకున్నా దాని వల్ల కలిగిన ఇబ్బందులు గుర్తించలేపోయారు. దీంతో జిల్లాల సంఖ్య పెరిగి తలనొప్పులు వస్తున్నాయి.

ప్రస్తుతం 33 జిల్లాలుగా చేయడంతో పరిపాలన సౌలభ్యం ఏమో గానీ ఆర్థిక భారం పెరుగుతోంది. జిల్లాల సంఖ్యను 17కు కుదించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తుంది. జిల్లాల సంఖ్య తగ్గిస్తే ఆర్థిక సమస్యలు కొంతవరకైనా తీరుతాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిల్లాలను కుదిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం యోచించినట్లు పలువురు నిపుణులు కూడా సూచించినట్లు చెబుతున్నారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దీని వల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాల సంఖ్య అనుకున్న దాని కంటే ఎక్కువ కావడంతో మొదటి నుంచి విమర్శలే వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం వెనకడుగు వేసేది లేదని జిల్లాల సంఖ్యను అమాంతం పెంచేసినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు పరిపాలన అంత సులభంగా సాగడం లేదు. జిల్లాల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా సదుపాయాలు కూడా కావాలి. అప్పుడున్న పరిస్థితుల్లో పెంచిన జిల్లాల సంఖ్యతో ఇప్పుడు తలనొప్పులు వస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో సరిపడ సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలే కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతోనే జిల్లాల సంఖ్యను కుదించాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

అవసరం లేని చోట కూడా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం కేసీఆర్ చేసిన పిచ్చి పనిగానే తేల్చారు. జిల్లా కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా చేయడం వల్ల కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. దీని వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల బారి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే జిల్లాల సంఖ్యను 17కు కుదించి పరిపాలనలో ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టాలని చూస్తోంది.

Tags:    

Similar News