కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ ఇవేనా ?
సరే ఐదైనా ఆరైనా ముఖ్య ఉద్దేశ్యం జనాలను ఆకట్టుకోవటమే. కాంగ్రెస్ నేతలు చాలాకాలం పెద్ద కసర్తతు చేసి సిక్స్ గ్యారెంటీస్ ను రెడీ చేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి
రాబోయే ఎన్నికల్లో జనాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రకటించనున్న గ్యారెంటీ పథకాలు ఐదు నుండి ఆరుకు పెరిగినట్లుంది. ఇంతకాలం ఫైవ్ గ్యారెంటీస్ అనే ప్రచారంకు బదులు తాజాగా సిక్స్ గ్యారెంటీస్ అనే ప్రచారం మొదలైంది. సరే ఐదైనా ఆరైనా ముఖ్య ఉద్దేశ్యం జనాలను ఆకట్టుకోవటమే. కాంగ్రెస్ నేతలు చాలాకాలం పెద్ద కసర్తతు చేసి సిక్స్ గ్యారెంటీస్ ను రెడీ చేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
పార్టీ నేతలు చెప్పిన ప్రకారం సిక్స్ గ్యారెంటీస్ ఏవంటే రు. 500కే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు రు. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫి, ఆసరా పెంఛన్లు నెలకు రు. 4 వేలు, ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2 వేల ఆర్ధికసాయం, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అభయహస్తం పథకంలో రు. 12 లక్షల ఆర్ధికసాయం. ఈ ఆరు హామీలను సోనియా 17వ తేదీన తుక్కుగూడలో జరగబోయే బహిరంగసభలో ప్రకటించబోతున్నట్లు సమాచారం.
కర్నాటక ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి అక్కడి కాంగ్రెస్ ఫైవ్ గ్యారెంటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఫైవ్ గ్యారెంటీస్ ఇచ్చిది కాబట్టి ఇక్కడ మరో హామీని అదనంగా జోడించి సిక్స్ గ్యారెంటీస్ అంటున్నట్లుంది. వీటిల్లో కూడా రు. 500 గ్యాస్ సిలిండర్, ఆసరా ఫింఛన్లు, నెలకు 2 వేల ఆర్ధికసాయం అన్నది ముఖ్యంగా మహిళలను ఉద్దేశించినవనే చెప్పాలి. ఆసరా రు. 4 వేల ఫింఛన్లు ఆడ, మగా ఇద్దరికి ఇస్తున్నా ఆడోళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా కట్టాయి.
పై సిక్స్ గ్యారెంటీస్ లో ఎస్సీ, ఎస్టీ, వృద్ధులు, మహిళలు, యువత, రైతులు ఇలా అన్నీ సెక్షన్లను కవర్ చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ కీలక నేతలు అభిప్రాయపడ్డారు. మరి హామీలివ్వటం కాదు అధికారంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వంపై పడబోయే ఆర్ధికభారం ఏమిటో. కర్నాటకలో కూడా ఫైవ్ గ్యారెంటీల్లో కొన్నింటికి స్వల్పంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మార్చిన విషయం తెలిసిందే. మరిక్కడ అధికారంలోకి వస్తే ఏమిచేస్తారో చూడాలి.