రాములమ్మ రాజకీయ జీవితం ఖతం !

సొంతపార్టీ మొదలు తాజాగా కాంగ్రెస్ పార్టీ వరకు విజయ శాంతి రాజకీయ ప్రస్థానం నిలకడ లేమితో సాగింది.

Update: 2024-07-02 04:16 GMT

టాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలే. ఇటు తెలుగు సినిమాల్లో, అటు తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ తనదైన ముద్ర వేశారు. అయితే, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన విజయశాంతి..ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం రాజకీయంగా నిలకడ సాధించలేకపోయారు.

సొంతపార్టీ మొదలు తాజాగా కాంగ్రెస్ పార్టీ వరకు విజయ శాంతి రాజకీయ ప్రస్థానం నిలకడ లేమితో సాగింది.

అన్ని పార్టీలు మారి చివరకు కాంగ్రెస్ లో చేరినప్పటకీ రాములమ్మకు తగిన గుర్తింపు రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విజయ శాంతి ఆటలు సాగడం లేదన్న టాక్ వస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా వినిపించే రాజకీయ నేతగా పాపులర్ అయిన విజయశాంతి...ఇపుడు ఆ సెంటిమెంట్ పదేళ్ల పాత ముచ్చట అయిపోవడంతో పొలిటికల్ గా సస్టెయిన్ కాలేపోతున్నారు. విజయ శాంతికి బలమైన సామాజిక వర్గం లేకపోవడం, బలమైన కేడర్ లేకపోవడం కూడా ఆమెను రాజకీయంగా బలహీనురాలిని చేశాయి.

ఇక, ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని పొలిటికల్ గా పాపులర్ అయిన బర్రెలక్క వంటి వారి మాదిరిగా విజయశాంతి సోషల్ మీడియాలో నెటిజన్లతో టచ్ లో ఉండకపోవం ఆమె మరో బలహీనత. తనకంటూ ఓ నియోజకవర్గం లేకపోవడంతో స్థానికంగా తనకుంటూ జనం లేరు. ఇక, దూకుడుగా తెలంగాణ యాసలో ప్రసంగించే సత్తా ఆమెకు లేదు. అందుకే, విజయ శాంతి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇమడలేకపోతున్నారన్న టాక్ వస్తోంది. ఏది ఏమైనా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాములమ్మ రాజకీయ జీవితం ఇక ఖతమ్ అయినట్లేనన్న టాక్ వస్తోంది.

Tags:    

Similar News