మోడీని దెబ్బ కొట్టేందుకు పీఎం పదవి ఆయనకు ఆఫర్ చేశారు
ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
‘మేం బాగుపడకపోయినా ఫర్లేదు. ఎదుటోడు మాత్రం బాగుండకడదు’ అన్నట్లు వ్యవహరించటం కాంగ్రెస్ పార్టీకి మొదట్నించి ఉన్న అలవాటే. తమకు అధికారం లేనప్పుడు.. తమకు ప్రత్యర్థికి సైతం పవర్ లోకి రాకూడదని.. అందుకు అవసరమైతే ఎవరికైనా సరే పవర్ చేతికి అప్పజెప్పేందుకు సిద్ధపడటం ఆ పార్టీకి అలవాటు. అదే పనిని తాజాగా చేశారు కానీ వర్కువుట్ కాలేదు. ఈ విషయం ఇప్పుడు వెల్లడైంది. కేంద్రంలో బీజేపీని దెబ్బ తీసేందుకు ఏర్పడిన ఇండియా కూటమి వేసిన ఎత్తుగడ బయటకు వచ్చింది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లుగా ఆ పార్టీ వెల్లడించింది. అయితే.. నితీశ్ ఆ ఆఫర్ ను రిజెక్టు చేసినట్లుగా పేర్కొంది. తాజాగా ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాము ఎన్డీయే కూటమిలో ఉన్నామని.. అయితే తమ నేతకు (నితీశ్) ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చినట్లుగా పేర్కొనటం సంచలనంగా మారింది.
"ఇండియా కూటమి నుంచి నితీశ్ ను ప్రధానమంత్రిని చేస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఆయన ఆ ఆఫర్ ను రిజెక్టు చేశారు. దీని గురించి నితీశ్ ను నేరుగా కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. మేం ఎన్డీయే కూటమిలో ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రశ్నే లేదు" అంటూ స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎన్డీయే కూటమి 292 సీట్లను మాత్రం గెలుచుకోగా.. ఇండియా కూటమిపై ఉన్న అంచనాలకు మించి 234 సీట్లను సొంతం చేసుకున్నారు. ఎన్డీయే కూటమిని దెబ్బ తీసేందుకు వీలుగా.. ఓవైపు నితీశ్ ను.. మరోవైపు చంద్రబాబును ఇండియా కూటమిలోకి రావాలంటూ ఆఫర్లు ఇవ్వటం.. అందుకు ఈ ఇద్దరు అధినేతలు నో చెప్పటం తెలిసిందే. ఇండియా కూటమి నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చిందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పి సంచలనంగా మారారు.