రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు ఖాయమా ?
ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపుఖాయమేనా ?
ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపుఖాయమేనా ? తాజాగా వెల్లడైన ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో గెలుపు ఖాయమని ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. రాజస్థాన్ లో పరిస్ధితి కాంగ్రెస్-బీజేపీ మధ్య ఫైట్ చాలా టైట్ గా ఉన్న చివరకు బీజేపీ జెండా ఎగిరే అవకావముందని ఒపీనియన్ పోల్లో తేలిందట. 90 సీట్లున్న చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కు 45-60 సీట్లమధ్య గెలుపు ఖాయమని చెప్పింది. బీజేపీకి 36-42 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది.
అలాగే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దే గెలుపట. 230 సీట్లున్న అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 116 సీట్ల మ్యాజిక్ పిగర్ దాటాలి. కాంగ్రెస్ 118-130 సీట్లలో విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్లో తేలింది. బీజేపీ 99-111 సీట్లకే పరిమితమవుతుందట. ఇక 200 సీట్లున్న రాజస్ధాన్ లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని తేలిందట. ఇక్కడ బీజేపీ 114- 124 సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయట. కాంగ్రెస్ 67-77 సీట్లకే పరిమితమవుతుందని ఒపీనియన్ పోల్లో తేలిందట.
ఇక 40 సీట్లున్న మిజోరంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పటం కష్టమని పోల్ చెప్పింది. ఎందుకంటే మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్, బీజేపీలు అధికారం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయట. కాకపోతే స్వల్ప మెజారిటితో ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వచ్చే అవకావాలున్నాయని అర్ధమవుతోందట.
ఇక ఫైనల్ గా తెలంగాణాలో బీజేపీ పరిస్ధితి చాలా దారుణంగా ఉందని తేలిందట. 119 సీట్లున్న తెలంగాణాలో బీఆర్ఎస్ కు 49-61 మధ్య సీట్లు వస్తాయట. అలాగే కాంగ్రెస్ కు 43-55 నియోజకవర్గాలు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. బీజేపీకి 5-11 నియోజకవర్గాలు వస్తే గొప్పగా చెప్పింది. అంటే ఒపీనియన్ పోల్ వ్యవహారం చూస్తే బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవక్కర్లేదని అర్ధమవుతోంది. మొత్తంమీద కాంగ్రెస్ కు ఎన్నికల్లో మిశ్రమ ఫలితం, బీజేపీకి చేదు అనుభవం తప్పదని అర్ధమవుతోంది.