కాంగ్రెస్ కు గుడ్ న్యూస్... పాజిటివ్ ఫలితాలు హల్ చల్!
దీంతో రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు హస్తం గుర్తు నాయకులు మరింత హుషారుగా పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణతో సహా త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి గుడ్ న్యూస్ వినిపించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ కు మరింత ఉత్సాహాన్నిచ్చే ఫలితాలు వెలువడ్డాయి. దీంతో రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు హస్తం గుర్తు నాయకులు మరింత హుషారుగా పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.
అవును... తెలంగాణతో కలిపి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ, మిజోరాం మినహా... మిగిలిన మూడు రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్ర దేశ్ ఎన్నికలపై సర్వే సంస్ధలు ప్రీ పోల్ నిర్వహించాయి. ఈ క్రమంలో తాజాగా ఆ ఫలితాలు విడుదల చేశాయి.
ఈ ఫలితాల ప్రకారం... మధ్యప్రదేశ్ లో తక్కువ మెజారిటీ అయినపటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలునాయని అంటున్నారు. మరింత వివరంగా పరిశీలిస్తే... ఎంపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230. అంటే... ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 116 సీట్లు సాధించి తీరాలి. ఈ నేపథ్యంలో... ఈటీజీ అనే సంస్ధ చేసిన సర్వేలో బీజేపీ 105-110 మధ్య తెచ్చుకుంటుందని తేలింది!
అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఆరు నుంచి పది స్థానాలు తక్కువే! ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే... 118 నుంచి 128 సీట్లు గెలిచే అవకాశముందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్ లో కాస్త కష్టపడితే కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది!
ఇదే సమయంలో ఛత్తీస్ ఘడ్ విషయానికొస్తే... ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. అంటే ఇక్కడ ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ కనీసం 46 సీట్లు తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలో తాజా సర్వే ఫలితాల ప్రకారం... ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి 51 సీట్లు తెచ్చుకుంటుందని తేలింది.
ఇదే సమయంలో బీజేపీ 38 సీట్లకే పరిమితమవుతుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాజస్థాన్ ఎన్నికల విషయానికొస్తే... కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీల మధ్య హోరాహోరీ వ్యవహారం ఉండబోతోందని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పడం కాస్త కష్టమనే చెబుతున్నారు.
ఘణాంకాల విషయానికొస్తే... 200 సీట్లున్న రాజస్థాన్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీ మ్యాజిక్ ఫిగర్ 101 సీట్లు సాధించాలి. ఈ నేపథ్యమంలో తాజా సర్వే ఫలితాల ప్రకారం ఇక్కడ బీజేపీకి 95-105 స్ధానాలు వచ్చే అవకాశముండగా.. కాంగ్రెస్ కు 91-101 సీట్ల మధ్య వచ్చే అవకాశముందని తేలింది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతుండగా... రాజస్థాన్ లో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు!
ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలంగాణ, మిజోరాం లకు సంబంధించిన ఫలితాలు ఏవీ వెలుగులోకి రాలేదు! కానీ... సర్వేలు జరిగిన మూడు రాష్ట్రాలలోను ప్రస్తుతానికి బీజేపీ కంటే కాంగ్రెస్ కు కాస్త అనుకూల పవనాలు ఉన్నాయనే అంటున్నారు పరిశీలకులు.