ఈ పోలీస్ పెళ్లి కార్డు చూసి తీరాల్సిందే... వీడియో వైరల్!

ఇటీవల కాలంలో వివాహ పత్రికల విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఆలోచిస్తూ.. రొటీన్ కి భిన్నంగా ప్రింట్ చేయిస్తున్నారు.

Update: 2024-09-21 21:30 GMT

ఇటీవల కాలంలో వివాహ పత్రికల విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఆలోచిస్తూ.. రొటీన్ కి భిన్నంగా ప్రింట్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒరిజినల్ తెలంగాణ స్లాంగ్ లో వెలుగులోకి వచ్చిన ఓ పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఇదే సమయంలో... వెస్ట్ గోదావరిలోని ఓ టీచర్ పెళ్లి కార్డు నెట్టింట హల్ చల్ చేసింది.

ఈ విధంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక విషయంలో కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు నేటి జనాలు. ఈ సమయంలో తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి పత్రిక విషయంలో వినూత్నంగా ఆలోచించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

అవును... తమిళనాడులోని ధర్మపురికి చెందిన డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) మనోజ్ కుమార్ తన పెళ్లి పత్రికను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రొటీన్ కి భిన్నంగా ఆలోచించిన ఆయన క్రియేటివ్ గా తయారు చేసిన తన వివాహ పత్రికను సోషల్ మీడియా సైట్స్ లో పోస్ట్ చేశారు. ఇది అచ్చం ఆపిల్ మ్యాక్ బుక్ తరహాలోనే ఉంది.

ఈ పత్రికను కవర్ పేజీ సిల్వర్ కలర్ లో ఉండగా.. దానిపై యాపిల్ సింబల్ ఉంది. దీంతో.. అది అచ్చం మ్యాక్ బుక్ లా కనిపిస్తోంది. దీన్ని ఓపెన్ చేస్తే.. అందులో గూగుల్ స్క్రీన్ కనిపిస్తుంది. మరో వైపు కీబోర్డ్ తరహా డిజైన్ ఉంది. ఈ గూగుల్ సెర్చ్ లో మనోజ్ - షాలినీల పెళ్లి సంబరాల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు చూపించారు.

ఈ సెర్చ్ రిజల్ట్స్ లో... వీరి వివాహ ముహూర్త సమయం, కల్యాణ వేదికకు సంబంధించిన గూగుల్ లొకేషన్ తో పాటు వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా తయారు చేశారు.

దీంతో... ఈ వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఐడియా అదిరిందని, అద్భుతంగా ఉందని కొందరంటే... మరీ నిశితంగా పరిశీలించారో ఏమో కానీ... యాపిల్ మ్యాక్ బుక్ లో సఫారీ బ్రౌజర్ కదా రావాలి అంటూ ఇంకొందరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా... ఈ పెళ్లి కార్డు మాత్రం సూపర్ అని అంటున్నారు మెజారిటీ నెటిజన్లు!

Full View

Tags:    

Similar News