కరోనా కొత్త వేరియెంట్... డెంజర్ విషయంచెప్పిన వైరాలజిస్ట్!

కరోనా... ఈ పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడుతుందనే విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించేసింది

Update: 2023-12-21 17:22 GMT

కరోనా... ఈ పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడుతుందనే విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించేసింది. అది సృష్టించిన కష్టాల నుంచి ఇంకా తేరుకోని ప్రజానికం కోకొళ్లలు అన్నా అతిశయోక్తి కాదు. ఈ సమయంలో కొవిడ్‌-19 కొత్త వేరియంట్ జేఎన్‌-1 తెరపైకి వచ్చింది. అయితే ఇది అంత ప్రమాదకారి కాదనే కామెంట్లు వినిపించన నేపథ్యంలో తాజాగా ఆ ఉద్దేశ్యాలు మారుతున్నాయి. ఈ సందర్భంగా వైరాలజిస్ట్ డేంజర్ విషయం వెల్లడించారు.

అవును... కొవిడ్‌-19 కొత్త వేరియంట్ జేఎన్‌-1 విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సిడ్నీ వైరాలజిస్ట్ స్టువార్ట్ టుర్విల్లీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో... గత వేరియంట్లు ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తే... ఈ తాజా జేఎన్-1 వేరియంట్ జీర్ణ వ్యవస్థను టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ఇదే సమయంలో రోగనిరోధక వ్యవస్థ కూడా గురించలేని విధంగా ఈ కొత్త వేరియంట్ ఉందని అన్నారు.

మరోపక్క.. జేఎన్‌.1 వేరియంట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ లోని బీఏ.2.8.6 శాఖకు చెందినదని.. ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను అధిగమిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయని అంటున్నారు అంటువ్యాధుల నిపుణులు. ఈ సమయంలో ఇప్పటి వరకు జేఎన్‌.1 సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఎలాంటి సమాచారం లేనప్పటికీ... స్వీయ నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

కాగా... దిల్లీ: దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 (ఛొవిద్-19) కొత్త వేరియంట్ జేఎన్‌.1 (ఝ్ణ్.1) కేసులు వెలుగుచూడటంతో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌.1 వేరియంట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ ఉపరకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కాగా... దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కొత్త వేరియంట్ జేఎన్‌.1 కేసులు వెలుగుచూడటంతో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఈ తరహా కేసులను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మూడు రాష్ట్రాల్లో గుర్తించింది. వీటిలో గోవాలో అత్యధికంగా 19 కేసులు నమోదవ్వగా... కేరళ, మహారాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున జేఎన్.1 వేరియంట్ కేసులను గుర్తించారు.

అయితే భారత్ లో ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు.. కొత్తగా వెలుగు చూసిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన స్థాయిలో ముప్పు ఉండదు కానీ అప్రమత్తత అవసరం అని చెబుతున్నారు. ఇందులో భాగంగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News