పవన్ పై నారాయణ ఫైర్... దళారి అంటూ కీలక వ్యాఖ్యలు!

పవన్ పై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా... పవన్ ను ఒక దళారిగా నారాయణ అభివర్ణించారని తెలుస్తుంది

Update: 2023-07-18 10:19 GMT

రాజకీయ విమర్శలందు సీపీఐ నారాయణ విమర్శలు వేరయా అంటుంటారు పరిశీలకులు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత, పవన్ కల్యాణ్ పై నారాయణ విరుచుకుపడ్డారని తెలుస్తుంది.

గతంలో పవన్ కల్యాణ్... తనకు కమ్యునిస్టు భావాలు ఉన్నాయని చెప్పుకున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఉభయ కమ్యునిస్టు పార్టీలతోనూ పవన్ సఖ్యతగానే వ్యవహరించారంటూ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా పవన్ పై గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో నారాయణ ఫైరయినట్లు తెలుస్తుంది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశంకోసం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... పవన్ పై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా... పవన్ ను ఒక దళారిగా నారాయణ అభివర్ణించారని తెలుస్తుంది.

అవును... పవన్ ఎన్డీయే మిత్రపక్ష కూటమి మీటింగ్ కు వెళ్లడంపై నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ - బీజేపీతో కలవడం లౌకికవాదానికి ప్రమాధం అని అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఇదే సమందర్భంగా కాస్త ఘాటైన ప్రశ్నలే సంధించారని తెలుస్తుంది.

ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఇవాళ ఎన్డీయేలో ఎలా చేరుతున్నాడో చెప్పాలంటూ పవన్‌ ను నారాయణ ప్రశ్నించారని తెలుస్తుంది. ఇదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ ఒక దళారీ అని.. అందుకే టీడీపీ-బీజేపీ మధ్య అనుబంధానం చేస్తున్నాడని.. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదని నారాయణ వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

ఇదే క్రమంలో... నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పడు సావర్కర్‌ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడని.. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడని నారాయణ ఎద్దేవా చేశారని తెలుస్తుంది. ఈ సందర్భంగా కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్‌ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చు అని నారాయణ సెటైర్స్ వేశారని అంటున్నారు!

Tags:    

Similar News