తాజా రిపోర్టు: వేలిముద్రలతో అంతమంది నేరస్తులు దొరికేశారు
వేలిముద్రల ద్వారా నిందితుల్ని గుర్తించటం.. వారిని పట్టుకోవటం మామూలే. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ముందు ఉన్నారు.
నేరస్తుడు ఎంత తెలివైనోడైనప్పటికీ అతను చేసిన తప్పు అతడ్ని పట్టించేస్తుంది. చివరకు కొందరు ముదురు పోలీసులు సైతం తమకున్న ప్రావీణ్యంతో అప్పుడప్పుడు నేరాలకు పాల్పడి మరీ దొరికిపోతుంటారు. ఎంతటివాడైనా సరే.. తప్పు చేస్తే తప్పించుకునే వీలుండదు. అందునా.. పెరిగిన సాంకేతికత పుణ్యమా అని నేరస్తుల్ని గుర్తించటం అంత కష్టమైన అంశం కాదు. తాజాగా విడుదల చేసిన జాతీయ నేర గణాంకాలకు సంబంధించిన నివేదిక ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.
వేలిముద్రల ద్వారా నిందితుల్ని గుర్తించటం.. వారిని పట్టుకోవటం మామూలే. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ముందు ఉన్నారు. ఈ అంశంలో ఏపీ రెండో స్థానంలో నిలిస్తే.. తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 3489 మంది నిందుతుల్ని ఫింగర్ ప్రింట్స్ ద్వారా పట్టుకున్న విషయాన్ని ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఇండియా 2022లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నేరస్తుల్ని పట్టుకునే విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మొదటి వరుసలో నిలవటం గమనార్హం.
దేశవ్యాప్తంగా 3489 మంది నిందితుల్ని వేలిముద్రల ఆధారంగా పట్టుకుంటే.. అందులో తమిళనాడులో 698 మందిని.. ఏపీలో 667 మందిని.. కర్ణాటకలో 528 మందిని.. తెలంగాణలో 449 మందిని.. కేరళలో 435 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్ లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.