ట్రంప్‌ ను కాల్చడానికి ముందు క్రూక్స్... వీడియో వైరల్!

అవును... ట్రంప్ పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ (20) ఘటనా స్థలంలోనే భద్రతా సిబ్బంది చేతిలో హతమయ్యాడు.

Update: 2024-07-16 17:10 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఈ ఘటన అనంతరం ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగాయని చెబుతుండటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ట్రంప్ పై కాల్పుల ఘటనలో నిందితుడు క్రూక్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అవును... ట్రంప్ పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ (20) ఘటనా స్థలంలోనే భద్రతా సిబ్బంది చేతిలో హతమయ్యాడు. ఆ సంగతి అలా ఉంటే... ఆ కాల్పులు జరపడానికి ముందు అతడు ఏం చేశాడనేది అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

మీడియా కథనాల ప్రకారం... ట్రంప్ పై కాల్పుల ఘటనలో నిందితుడు మాథ్యూ క్రూక్స్... ఈ ఘటనకు పాల్పడటానికి ముందు రోజు ప్రాక్టీస్ కూడా చేశాడంట. అనంతరం కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏమో కానీ... షాప్ కి వెళ్లి ఐదడుగుల నిచ్చెన కొనుగోలు చేసి, అక్కడ నుంచి గన్ స్టోర్ కి వెళ్లి బుల్లెట్లు కొని వచ్చాడంట. ఆ నిచ్చెనను ఫైరింగ్ చేసేందుకు ఎంచుకున్న బిల్డింగ్ ఎక్కడానికి ఉపయోగించాడట.

ఇలా, ఎలా చేశాడు అనే విషయంపై క్లారిటీ వచ్చిన అనంతరం... అసలు ఎందుకు చేశాడు అనే విషయాలపైనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) దృష్టి సారించిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అతడి సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ ను సక్సెస్ ఫుల్ గా యాక్సిస్ చేసినప్పటికీ... అందులో పెద్దగా ఉపయోగపడే డేటా ఏదీ లభ్యం కాలేదని చెబుతున్నారు.

ఈ సమయంలో "ఐ హేట్ రిపబ్లికన్స్.. ఐ హేట్ ట్రంఫ్" అంటూ క్రూక్స్ మాట్లాడిన వీడియో తెరపైకి వచ్చింది. అయితే... ఇది కాల్పుల ఘటనకు ముందు రోజే రికార్డ్ చేశాడా.. లేక, పాత వీడియోనా అనేది తెలియాల్సి ఉంది! అయితే... ఆ వీడియోలో మాత్రం ట్రంప్ పైనా, రిపబ్లికన్స్ పైనా అతడి ద్వేషం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

కాగా... ట్రంప్ పై కాల్పులకు తెగబడిన మాథ్యూ క్రూక్స్... 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్కూల్లో ఉండగా.. మ్యథ్స్ లో యాక్టివ్ గా ఉండేవాడని.. నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ నుంచి అతడు 500 డాలర్ల "స్టార్ అవార్డు" ను కూడా అందుకున్నాడని చెబుతున్నారు. ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతడు ఓ నర్సింగ్ హోం లో పనిచేస్తున్నాడని తెలుస్తుంది.

Tags:    

Similar News