ఇదేం పిచ్చ? చిన్నారికి కీర తినిపించే వేళ రగడ.. కత్తిపోట్లు

కొన్ని ఘటనల గురించి విన్నంతనే విస్మయానికి గురయ్యేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

Update: 2025-01-03 05:30 GMT

కొన్ని ఘటనల గురించి విన్నంతనే విస్మయానికి గురయ్యేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. కొట్టుకోవటానికి మరే విషయం లేనట్లుగా.. చిన్నారికి కీరదోసకాయ తినిపించే విషయంలో తలెత్తిన ఇష్యూ.. ఏకంగా ఇంటి పెద్ద ప్రాణాల్ని తీయటమే కాదు.. ఇంట్లో మరో ముగ్గురికి కత్తిపోట్ల వరకు వెళ్లిన దారుణ హింసా కాండ గురించి తెలిస్తే నోట వెంట మాట రాదంతే. కీర దోసకాయ కోసం అంత రచ్చ? అనుకోకుండా ఉండలేం. కర్ణాటకలోని చామరాజనగరలోని ఒక కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే.. కొళ్లేగాల ఈద్గా మొహల్లాకు చెందిన పార్మాన్ తన అన్న కుమార్తెకు కీర దోసకాయ తినిపిస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి సోదరి ఐమాన్ బాను అతన్ని అడ్డుకుంది. చిన్నపిల్లలకు కీర దోసకాయ తినిపించొద్దని చెప్పింది. కీర దోసకాయ తినిపిస్తే.. జ్వరం వస్తుందంటూ చెబుతూ వద్దని వారించింది. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది.

అంతలోనే గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో విచక్షణ కోల్పోయిన ఇంటి పెద్ద ఫార్మాన్ కత్తితో దాడి చేశాడు. కీర దోసకాయను తినిపించొద్దని వారించిన ఐమాన్ బాను (26)ను కోపంతో పొడిచేయటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఫార్మాన్ ను అడ్డుకునే ప్రయత్నంలో అతడి తండ్రి సయ్యాద్.. వదినలపైనా కత్తి దూశాడు. ఈ దాడిలో సయ్యద్ కు కత్తిపోట్లతో పాటు చేయి కూడా విరిగింది. కీర దోసకాయ తినిపించే విషయం ఇంతటి రచ్చ కావటం.. ఒక ప్రాణం పోయేవరకు వెళ్లింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

Tags:    

Similar News