సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరస్థుల కన్ను... ఈ జాగ్రత్తలు మస్ట్!

ఈ సమయంలో తాజాగా సమగ్ర కుటుంబ సర్వేపైనా సైబర్ నేరస్థులు కన్ను వేశారని అంటున్నారు.

Update: 2024-11-08 04:41 GMT

ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ నేరస్థుల బారిన పడటం తప్పదనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తుంది. ఇదే సమయంలో.. కాదేదీ సైబర్ క్రైమ్ కు అనర్హం అన్నట్లుగా ఆ బ్యాచ్ కూడా సరికొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమయంలో తాజాగా సమగ్ర కుటుంబ సర్వేపైనా సైబర్ నేరస్థులు కన్ను వేశారని అంటున్నారు.

అవును... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపైనా సైబర్ నేరస్థుల కన్ను పడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఫ్యామిలీ డిటైల్స్ సేకరించేందుకు ఫోన్ చేశామని చెబుతూ.. అడిగిన పత్రాలు ఇవ్వాలని కోరుతూ కాల్స్ వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.

సర్వేలో భాగంగా కాల్ చేశామని చెబుతూ... ఆధార్, పాన్, తదితర వివరాలు అడుగుతున్నారని.. లేనిపక్షంలో తాము పంపించే లింక్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నేరగాళ్లు నమ్మిస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో వాళ్లు వాట్సప్ కు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే... ప్రమాదకర యాప్ లు ఫోన్ లో డౌన్ లోడ్ అయిపోతాయి.

దీంతో.. మన ఫోన్ ని వాళ్లు పూర్తిగా యాక్సిస్ చేయగలుగుతారు! ఇందులో భాగంగా... ఆ ఫోన్ లోని ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు మొదలైన వివరాలను తమ చేతుల్లోకి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు. అక్కడ నుంచి వారి అసలు పని మొదలవుతుందని.. ఆ ఫోన్ లలో ఉన్న పర్సనల్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు!

ఇదే సమయంలొ అప్పటికె యాక్సిస్ పొందిన బ్యాంక్ ఖాతా పాస్ వర్డ్స్ తో డబ్బును తస్కరించడం చేస్తారని అంటున్నారు. మరికొంతమంది... ఆ ఫోన్ లలోని ఫోటోలను మార్ఫింగ్ చేసి భారీగా డబ్బు గుంజుతారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో... సర్వే సిబ్బంది నేరు గా ఇళ్లకే వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు తప్ప.. ఫోన్ లు చేసి, ఫోన్ లకు లింకులు పంపరు అనే విషయం అంతా గుర్తుంచుకొవాలి. ఇదే సమయంలో... సర్వే సిబ్బంది ఆధార్, పాన్, రేషన్ కార్డులు తీసుకోరు.. ఫోటోలు అడగరు! ఇదే సమయంలో... వేలి ముద్రలు సేకరించరు.

ఈ విషయాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఏదైనా అనుమానాస్పద లింకులు వచ్చినా, మోసిపోయినట్లు తెలిసినా వెంటనే "1930" ట్రోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News