బాబు అరెస్ట్‌ పై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు... ఫస్ట్ ప్లేస్ అంటున్న నెటిజన్లు!

ఇందులో భాగంగా... పురందేశ్వరి ట్విట్టర్ లో స్పందించారు. "ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది

Update: 2023-09-09 07:18 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించిన కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు.

అవును... అవినీతికేసులో ఐటీ నోటీసులు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం అంటూ.. చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై స్పందించిన పురందేశ్వరి, తాజాగా బాబు అరెస్టుపైనా స్పందించారు. అవినీతికి సంబంధించిన ఐటీ శాఖ నొటీసులు ఇవ్వడం సింపులు విషయం, తాను స్పందించాల్సిన అవసరం లేదన్నట్లుగా స్పందించిన ఆమె... చంద్రబాబు అరెస్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... పురందేశ్వరి ట్విట్టర్ లో స్పందించారు. "ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది" అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.

అయితే అరెస్ట్ సమయంలో చంద్రబాబు లాయర్లకు ఏపీ సీఐడీ అధికారులకూ వాగ్వాదం జరిగిన సమయంలో... హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు అన్నీ ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. రిమాండు రిపోర్టులో అన్ని విషయాలు క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో... బాబు లాయర్లు సైడ్ అయిన అనంతరం అరెస్ట్ జరిగిందని అంటున్నారు.

అయితే పురందేశ్వరి మాత్రం... ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చంద్రబాబుని అరెస్టు చేశారన్ని ఫైరవుతున్నారు. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు అరెస్టును ఖండిస్తుందని చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుని వెనకేసుకొచ్చే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పురందేశ్వరి వెనక్కు నెట్టి, ఆమె ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తుండటం గమనార్హం!

కాగా... చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. "ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ దర్యాప్తులో భాగంగానే సీఐడీ అధికారులు చంద్రబాబుని అరెస్ట్ చేశారు. నేరానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నపుడు ఇలా చేయడం సాధారణమే. కానీ ఈ కేసులో అసలు విషయాన్ని పక్కనబెట్టి టీడీపీ, ఎల్లోమీడియా కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది" అని ట్వీట్ చేశారు!

Tags:    

Similar News