సేమ్ టు సేమ్... ఏపీ బీజేపీ మారాలేమో..!
అంతేకాదు.. ''బాబుగారి హయాంలో మద్యంలో దందా సాగుతోంది. అధికార పార్టీనేతలు దోచుకుంటున్నా రు. వారి ఆస్తులు పెరుగుతున్నాయి
ఒకే విమర్శ.. కాకపోతే.. సంవత్సరాలు గడిచాయి. ప్రభుత్వాలు మారాయి.. విమర్శించే నాయకులు కూడా మారారు అంతే తేడా! విమర్శల్లో మాత్రం మార్పు లేదు. అదే.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నవారు.. రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న, చేసిన విమర్శ. ''చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం పెడుతున్న పథకాలను తనవిగా చెబుతోంది. ఆ పథకాలపై మోడీ బొమ్మలు కూడా వేయడం లేదు. చంద్రబాబు సొమ్ము ఏమైనా ఖర్చు పెడుతున్నారా?''- ఓ ఐదేళ్ల కిందటకు వెళ్తే.. అప్పటి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్ ఇది!
అంతేకాదు.. ''బాబుగారి హయాంలో మద్యంలో దందా సాగుతోంది. అధికార పార్టీనేతలు దోచుకుంటున్నారు. వారి ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రజల ఆస్తులు తగ్గుతున్నాయి. దీనిపై కేంద్రం విచారణకు రావాలని మేం కోరుతున్నాం!'' అని కూడా సోము సర్ ముక్తాయించారు. కానీ, ఇది ఒట్టి పటాటోపమేనని తేలిపో యింది. అంతేకాదు.. కేంద్రం కూడా పట్టించుకోలేదు. ఇక, ఆ ముచ్చట ముగిసింది.
కట్ చేస్తే.. సేమ్ అలగేషన్స్ ఇప్పుడు చీఫ్‌గా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా చేస్తున్నారు. మద్యంలో కుంభకోణం జరుగుతోందని, వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవా లని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం జగన్ దోచుకుంటున్నా రని.. ఆయన జేబులో కి వెళ్తున్నాయని అన్నారు. అంతేకాదు.. కేంద్రం ప్రవేశ పెడుతున్న పథకాలను తనవిగా వైసీపీ ప్రచారం చేసుకుంటోందని చెప్పారు.
ఇక, దీనిపై కేంద్రం విచారణకు కోరతామని కూడా పురందేశ్వరి వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడ గత సోము వీర్రాజు చేసిన విమర్శలు కానీ.. ఇప్పుడు పురందేశ్వరి చేస్తున్న విమర్శలు కానీ. కొత్తవి అయితే కాదు. ఎందుకంటే.. అన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేస్తున్నవే. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో పూర్తిస్థాయి నిధులు కేంద్రం ఎక్కడా ఇవ్వదు. రాష్ట్రాలు వాటాలు ఇస్తాయి. ఈ విషయాన్ని మరిచిపోయారో.. లేక.. తెలిసే ఇలా చేస్తున్నారో కానీ.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలే గుసగుస లాడుతుండడం గమనార్హం.