పురేందశ్వరి పుడింగా!?
పురందేశ్వరి ఏమన్నా.. పుడింగా!? - అంటూ బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
పురందేశ్వరి ఏమన్నా.. పుడింగా!? - అంటూ బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి B టీంగా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారని అన్నారు. ''ఆనాడు ఎన్టీఆర్ కి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురందేశ్వరి కూడా ఒకరు. కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి పురందేశ్వరి'' అని కొడాలి అన్నారు.
కన్న తండ్రి వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి ఆయన మనసిక వేదనతో మరణించేలా చేసిన కూతురు ప్రపంచంలో ఏ తండ్రికీ ఉండరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కొడాలి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇసుక దోపిడీతో పాటు అనేక దోపిడిల్లో పురందేశ్వరికి కూడా వాటాలు వెళ్ళేవని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి 4000కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక మీద ఒక్కరూపాయి కూడా రాలేదు మీరంతా కలిసి ఆ డబ్బులు దోచుకోలేదా? అని పురందేశ్వరిని కొడాలి ప్రశ్నించారు. పురందేశ్వరి సిగ్గుశరం లేకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పురందేశ్వరి చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరి లంచాలు తీసుకున్నావని అందరూ చెప్పేమాటేనన్నారు.
ఇప్పటికి చాలా పార్టీలు మారి ఆ పార్టీలను భూస్టాపితం చేసిన వ్యక్తి.. పురందేశ్వరేనని కొడాలి చెప్పారు. పురందేశ్వరికి రాష్ట్ర ప్రజలు 2014, 2019 ఎన్నికలలో బుద్ది చెప్పినా సిగ్గుశరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వపై అవాకులు చేవాకులు పెలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కొడాలి హెచ్చరించారు.