జగన్ కు పురందేశ్వరి లీగల్ నోటీసులు?... ఆ వ్యాఖ్యలే కారణం!
ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి
ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లీగల్ నోటీసులు జారీ చేశారు! దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం.. ఇటీవల పురందేశ్వరి, ఆమె కుటుంబ సభ్యులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తుంది.
అవును... ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. సీఎం జగన్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు! విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు తన బంధువులే అంటూ ప్రొద్దుటూరు బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... తన కుమారుడు, తన కూతురు మామగారు డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు చెబుతున్న సంద్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్లుగా ఉన్నారని నిరూపించాలని సవాల్ చేశారు!
ఈ సందర్భంగా స్పందించిన పురందేశ్వరి... సీఎం ప్రకటన పూర్తిగా అవాస్తవమని.. నిరాధారమని.. తనను, తన కుటుంబ సభ్యులను అవమానించడం, కించపరచడం, తమ పరువు తీయడం వంటి ఉద్దేశ్యాలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇదే క్రమంలో... రానున్న ఎన్నికల్లొ రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతోనే సీఎం ఈ ప్రకటన చేశారని తెలిపారు.
సీఎం చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని, తనను, తన కుటుంబ సభ్యులను అవమానించడం, కించపరచడం, పరువు తీయడం వంటి ఉద్దేశ్యంతో ఇది చేశారని ఆమె అన్నారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచనతో సీఎం ఈ ప్రకటన చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు వాస్తవ పరిస్థితులను సరిచూసుకోవాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందని ఆమె అన్నారు.
ఇలా తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా చేసిన వ్యాఖ్యలకు బహిరంగ ప్రకటన ద్వారా సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. ఏడు రోజుల్లో ఈ పరువు నష్టం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. అలాకానిపక్షంలో సీఎంపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పురందేశ్వరి హెచ్చరించారు!
కాగా... 25వేల కిలోల డ్రగ్స్ దిగుమతి వ్యవహారంలో పురందేశ్వరి సన్నిహిత, బంధువుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మార్చి 22 నుంచి 24 వరకూ తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రకటనలు విడుదల చేసినందుకు జగతి పబ్లికేషన్, ఇతరుల నుంచి 20 కోట్ల నష్టపరిహారం కోరిన సంగతి తెలిసిదే!!