దావోస్ లో ఆ ఐదు రోజులు అమ్మాయిల బుక్కింగ్స్ లో రికార్డ్స్!

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 20 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు - 2025 జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-27 04:20 GMT

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 20 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు - 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి నాయకులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు మొదలైనవారు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును.. దావోస్ లో ఇటీవల ఐదు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా వాతావరణ మార్పులు, నాలుగో పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ అనేవి కీలక అంశాలుగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది.

ఈ మేరకు బ్రిటీష్ మీడియా డైలీ మెయిల్ ఓ సంచలన విషయం తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా.. ఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది.

సుమారు 3,000 మంది వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, నాయకులు హాజరైన వేళ.. ఈ తరహా కథనాలు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దావోస్ లో జరిగే సదస్సుకు వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకునో ఏమోకానీ... "డేట్ యూ పే ఫర్" ఫేరిట ఓ వెబ్ సైట్ ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీమెయిల్ తెలిపింది! ఇక.. టిట్4టాట్ ప్రతినిధి మాట్లాడుతూ.. డబ్ల్యూఈఎఫ్ జరిగిన 5 రోజుల్లో 300 మంది అమ్మాయిలు, లింగ మార్పిడి మహిళలను దావోస్ లో బుక్ చేసుకున్నారని వివరించారు!

ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని.. గత ఏడాది 170 మందినే బుక్ చేసుకుంటే.. ఈ సారి ఏకంగా 300 మందిని బుక్ చేసుకున్నారని.. బుకింగ్స్ లో ఇది సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారని అంటున్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

లక్షల్లో సంపాదన కోట్లలో వ్యాపారం!:

ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు (రు.6.5 లక్షలు) సంపాదించారని.. ఈ బుక్కింగ్ వ్యవధి 4 గంటలని.. ఈ ఈవెంట్ ప్రారంభమైనప్పటినుంచీ మొత్తం బుక్కింగ్స్ లో ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9.68 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చని అంటున్నారు!

Tags:    

Similar News