దారుణం... విమానం ల్యాండింగ్ గేర్ లో మృతదేహాలు!
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని మరో విమానం ల్యాండింగ్ గేర్ వద్ద ఈసారి రెండు మృతదేహాలు కనిపించడం సంచలనం రేపింది.
గత డిసెంబర్ లో షికాగో నుంచు మౌయీ విమానాశ్రయానికి వచ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్ లో ఓ మృతదేహం కనిపించిన సంగతి తెలిసిందే. నాడు ఈ విషయం తీవ్రకలకలం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని మరో విమానం ల్యాండింగ్ గేర్ వద్ద ఈసారి రెండు మృతదేహాలు కనిపించడం సంచలనం రేపింది.
అవును... అమెరికాలోని విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. దీంతో... గడిచిన నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అయ్యింది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో విమానం తనిఖీల సమయంలో వీటిని గుర్తించినట్లు చెబుతున్నారు.
న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం నుంచి జెట్ బ్లూకు చెందిన విమానం ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్ విమానాశ్రయానికి వచ్చింది. ఆ సమయంలో.. ప్రయాణం అనంతరం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ల్యాండింగ్ గేర్ వద్ద ఈసారి రెండు మృతదేహాలను గుర్తించారు.
దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర కలకలం రేపింది. ఇదే సమయంలో... విమానం ల్యాండింగ్ గేర్ వద్ద రెండు మృతదేహాలను గుర్తించినట్లు జెట్ బ్లూ సంస్థ ధ్రువీకరించింది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు మగవారేనని.. ప్రస్తుతానికి అంతకు మించి గుర్తింపులు తెలియలేదని బ్రోవార్డ్ కంటీ షెరీఫ్ కార్యాలా ప్రతినిధి కారీ కాడ్ అన్నారు.
ఇదే సమయంలో బ్రోవార్డ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం.. ఈ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను శవపరీక్షలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆ రెండు మృతదేహాలూ బాగా కుళ్లిపోయాయని చెబుతున్నారు.