''పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు'' అని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం!
అయితే అలాఏమీ కాదు... మృత్యువు అనివార్యం కాదు.. ఇకపై ఆప్షనల్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. నువ్వు మరణిస్తావో లేదో ఇకపై నీ ఇష్టం అన్నరేంజ్ లో చెబుతున్నారు. త్వరలో చావు అప్షనల్ అని నొక్కి వక్కానిస్తున్నారు. ఇది వీలైనంత త్వరలో సాధ్యమవుతుందని ఒక అంచనా కూడా వేసి చెబుతున్నారు.
అవును... పుట్టిన వాడికి మరణము తప్పదు అనే మాటలు ఇకపై పోతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరణాన్ని ఎంచుకునే అవకాశం రాబోతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... మరో 22 ఏళ్లలో మనం చావాలో వద్దో మనమే నిర్ణయించుకోవచ్చని జన్యుశాస్త్రవేత్తలు తెలిపారు!
వయసు పెరగకుండా తగ్గించొచ్చని, మృత్యువును ఆప్షనల్ గా ఎంచుకోవచ్చని "ది డెత్ ఆఫ్ డెత్" పుస్తకావిష్కరణలో ఈ విషయాన్ని వెల్లడించారు జన్యు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంఘా 2045కల్లా కేవలం ప్రమాదాల ద్వారానే చావు సంభవిస్తుందని అన్నారు. జన్యుప్రక్రియల ద్వారా మరణించాలో లేదో ఎంచుకోవచ్చని అన్నారు.