నాకు ఓటు వేయొద్దు... బైడెన్ ను తాకిన డీప్ ఫేక్ సెగ!

తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో డీప్‌ ఫేక్‌ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ ను సైతం ఈ సమస్య తాకడంతో విషయం చర్చనీయాంశం అయ్యింది.

Update: 2024-01-27 07:57 GMT

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ కు సంబంధించిన విషయాలు తీవ్ర వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సినీతారలు, సెలబ్రెటీలు లక్ష్యంగా భారత్ లో డీప్ ఫేక్క్ వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఇలాంటి పనులు చేసేవారిని వెంటాడుతుంది! ఈ క్రమంలో తాజాగా అమెరికానూ డీప్ ఫేక్ సెగ తాకడం ఆసక్తిగా మారగా... వైట్ హౌస్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది.

అవును... తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో డీప్‌ ఫేక్‌ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ ను సైతం ఈ సమస్య తాకడంతో విషయం చర్చనీయాంశం అయ్యింది. ఇందులో భాగంగా... బైడెన్‌ వాయిస్ అనుకరిస్తూ ముందుగానే రికార్డ్‌ చేసిన ఫోన్‌ కాల్స్‌, గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్‌ హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన వైట్‌ హౌస్ ప్రెస్ సెక్రటరీ... తప్పుడు ఫోటోలు, సమాచార వ్యాప్తిపై తీవ్ర ఆందొళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం అని వెల్లడించారు. ఈ విషయాలపై స్పందించిన ఆయన... ట్విటర్‌ వంటి సంస్థల్లో నిబంధనలు ఉన్నప్పటికీ.. టేలర్‌ స్విఫ్ట్ కు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించలేకపోయారని అన్నారు.

ఈ డీప్ ఫేక్ లకు సంబంధించిన అంశాలు సుమారు 17 గంటల పాటు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో 45 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయని వెల్లడించారు. ఈ సమయంలో... ఈ చిత్రాలపై ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా... ఈ ఏడాది చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం ప్రైమరీ పోల్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వారం న్యూహాంప్‌ షైర్‌ లో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు అధ్యక్షుడు బైడన్‌ చెప్పినట్టుగా ప్రీ రికార్డెడ్ అయిన కొన్ని ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయొద్దని ఆయన ఓటర్లను కోరడం వాటి సారాంశం. ఇలా బైడెన్ వాయిస్‌ ను అనుకరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News