ఏపీ లిక్కర్ లాటరీలో ఢిల్లీ వ్యాపారి... షాకింగ్ అప్లికేషన్లు, సర్ ప్రైజ్ షాపులు!

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

Update: 2024-10-15 07:34 GMT

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ సమయంలో విశాఖ జిల్లాలో 155 దుకాణాలకు గానూ 4,129 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 31 షాపులు మహిళలకు దక్కాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూరైపోయింది.

అయితే... ఈ విశాఖ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం రాష్ట్రేతరులు కూడా పోటీ పడ్డారు. ఇతర జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలోనే వచ్చారు. ఈ క్రమంలో లాటరీలు దక్కిన వారిలో చాలా మంది పాతవ్యాపారులే ఉండగా.. కొత్తవారు 30శాతం మంది ఉన్నారని అంటున్నారు. చాలామంది సిండికెటుగానే ఏర్పడి దక్కించుకున్నారు!

ఈ క్రమంలో చాలా సీనియర్లు, సెంటిమెంటుతో లక్కీ నెంబర్ల ప్రకారం దరఖస్తులు చేసినప్పటికీ వారికి కలిసిరాకపోగా... సరదాగా వేద్దామని భావించి ఫస్ట్ టైం వేసినవారిలో కొంతమందికి మాత్రం అదృష్టం వరించడం గమనార్హం. ఈక్రమంలో విశాఖలో భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసిన ఢిల్లీ వ్యాపారి హాట్ టాపిక్ గా మారారు.

అవును... విశాఖ జిల్లాలో వైన్ షాపుల కోసం ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడిన నేపథ్యంలో.. ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖలోని మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయన ఏకంగా 155 వైన్ షాపులకూ దరఖాస్తు చేసుకున్నారు. అమిత్ అగర్వాల్, నందినీ, సారికా, సౌరభ్ పేర్లతో దరఖాస్తులు సమర్పించారు.

ఈ క్రమంలో ఒక్కో దుకాణం లాటరీకి సంబంధించిన దరఖాస్తు చేసిన పాతిక నుంచి 30 మంది మారుతున్నప్పటికీ... ఈయన మాత్రం కుర్చున్న చోట నుంచి కదలలేదు. దీంతో... కలెక్టర్, ఎక్సైజ్ సిబ్బంది ఆరా తీయగా... తాను 155 షాపులకూ దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అధికారులు షాక్ కి గురయ్యారని అంటున్నారు.

అంటే... 155 షాపులకూ దరఖాస్తు చేయడం అంటే... కేవలం దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లకు పైగా ఉంటుంది. అంత స్థాయిలో ఖర్చు చేసి అప్లైచేసిన సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఇదే క్రమంలో ఒడిశా నుంచి తెలంగాణ నుంచి కూడా విశాఖలోని వైన్ షాపులకు దరఖాస్తు చేశారు!!

Tags:    

Similar News