అక్కడ పాతికేళ్లలోపు పెళ్లి కాలేదంటే... దాల్చిన చెక్కే!

అవును... డెన్మార్క్‌ లో పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే.. అభిషేకం చేసినట్లుగా తల మీద నీళ్లు కుమ్మరిస్తారు.

Update: 2023-09-19 13:30 GMT

ప్రతీ వ్యక్తి జీవితంలోనూ పెళ్లికి అంత ప్రాముఖ్యముంది. దాదాపు ప్రతీ మనిషీ తన జీవితాన్ని పెళ్లికి ముందు, ఆ తర్వాతగా భావిస్తుంటారని, పెళ్లి అనేది లైఫ్ చేంజింగ్ పాయింట్ అని చెబుతుంటారు. అప్పటివరకూ బ్యాచ్ లర్ గా, తల్లితండ్రుల చాటు బిడ్డగా గడిపేసిన వ్యక్తి... పూర్తి బాధ్యతలతో కూడిన బంధంలోని అడుగుపెట్టే దశ అది!

ఈ సమయంలో వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు. పిల్లలు కూడా యౌవ్వనకాలంలోనే పుట్టాలని, ఫలితంగా వారు మరింత ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉంటారని చెబుతారు. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల పెళ్లిల్లు చాలా ఆలస్యం అయిపోతున్నాయి. 30 కి ముందు పెళ్లంటే ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి!

ఈ పరిస్థితుల్లో వైవాహిక జీవిత ఆవశ్యకతను చాటుతూ, అది కూడా వయసులో ఉండగానే కానిచ్చే అవసరాన్ని గుర్తుచేస్తూ డెన్మార్క్‌ లో ఒక చిత్రమైన ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే వారిని ఒక ఆటాడుకుంటారు.. అయితే అది శిక్షగా భావించనప్పటికీ ముదురు బెండకాయ అనే గుర్తును వెలుగులోకి తెస్తుంది.

అవును... డెన్మార్క్‌ లో పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే.. అభిషేకం చేసినట్లుగా తల మీద నీళ్లు కుమ్మరిస్తారు. తర్వాత తల నుంచి పాదాల వరకూ దాల్చిన చెక్క పొడి జల్లుతారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడాలేవీ లేవు. అయితే ఆ దేశంలో వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీని వల్ల ఫలితం ఏమిటో తెలియకున్నా.. ఎవరూ వ్యతిరేకించరు, శిక్షగా కూడా భావించరట!

ఇంకానయం పొరపాటున ఈ రోజుల్లో ఆ ఆచారం ఇండియాలో ఉండి ఉంటే... పెద్ద పనే అయ్యేది. డైలీ వందల మందికి, కాదు కాదు వేల మందికి ఇలాంటి అభిషేకాలూ గట్రా చేయవలసి వచ్చేది. అలా పెరిగిపోతుంది మరి బ్యాచ్ లర్స్ సంఖ్య!

Tags:    

Similar News