"మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024"గా ధృవీ పటేల్... రెండు కోరికలివే!
భారతదేశం వెలుపల జరిగే అతిపెద్ద అందల పోటీలు ముగిశాయి.
భారతదేశం వెలుపల జరిగే అతిపెద్ద అందల పోటీలు ముగిశాయి. ప్రవాస భారతీయుల ప్రతిష్టాత్మక పోటీగా చెప్పే "మిస్ వరల్డ్ వైడ్ 2024" లో యూ.ఎస్.ఏ. కు చెందిన ధృవీ పటేల్ విజేతగా నిలిచారు.. కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ధృవీ... తన రెండు కోరికలను బయటపెట్టింది.
అవును... ప్రవాస భారతీయుల ప్రతిష్టాత్మక పోటీలు "మిస్ వరల్డ్ వైడ్ 2024" తాజాగా జరిగాయి. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన ధృవీ పటేల్ విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. తనకు బాలీవుడ్ లో నటించాలని.. యూనిసెఫ్ అంబాసిడర్ గా రాణించాలని ఉందని అన్నారు.
"మిస్ వరల్డ్ వైడ్" 31వ వార్షికోత్సవ పోటీలు తాజాగా న్యూజెర్సీలో జరిగాయి. ఇందులో శ్రీమతి, టీన్స్ సహా పలు విభాగాల్లో మహిళలు పోటీ పడ్డారు. వీరిలో యూఎస్ కు చెందిన ధృవీ పటేల్ విన్నర్ గా నిలిచారు. ఈమె అమెరికాలో కంప్యూటర్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ స్టూడెంట్ గా ఉన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె... మిస్ వరల్డ్ వైడ్ విజేతగా నిలవడం తనకు ఎంతో ఆనందగానూ, గౌరవంగానూ ఉందని తెలిపారు. ఇది కేవలం కిరీటం మాత్రమే కాదని.. తన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ నేపథ్యంలోనే... బాలీవుడ్ లో నటించాలని, యూనీసెఫ్ అంబాసిడర్ గా రాణించాలని ఉందని అన్నారు.
ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా సురినామ్ కు చెందిన లీసా.. రెండో రన్నరప్ గా నెదర్లాండ్స్ కు చెందిన మాళవిక శర్మ నిలిచారు. ఇక శ్రీమతి విభాగంలో సూఅన్ మౌటెట్ విజేతగా నిలవగా.. నంబియార్, యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన పవన్ దీప్ కౌర్ లు వరుసగా మొదటి, రెండో రన్నరప్ గా నిలిచారు.
ఇక టీన్ విభాగంలో గ్వాడెలోప్ కు చెందిన సియొర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని గెలుచుకోగా.. నెదర్లాండ్ కు చెందిన శ్రేయా సింగ్, సురినామ్ కు చెందిన శ్రద్ధా టెడ్జో వరుసగా మొదటి, రెండవ రన్నరప్ లుగా నిలిచారు.