వైసీపీ-టీడీపీ: కొన్ని రాజకీయాలు.. !
ఎంతో శ్రమించి .. 164 స్థానాల్లో విజయం దక్కించుకున్న కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీ.
వైసీపీ.. ప్రతిపక్ష పార్టీ. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న ఏ ప్రాధాన్యం లేని పార్టీ. అధికార పక్షం నేతల మాటలో చెప్పాలంటే.. అరాచక పార్టీ. అరాచక శక్తులతో నిండిపోయిన పార్టీ.
టీడీపీ.. అధికారంలోకి వచ్చిన పార్టీ. ఎంతో శ్రమించి .. 164 స్థానాల్లో విజయం దక్కించుకున్న కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీ. పులుకడిగిన ముత్తాలు ఉన్న పార్టీ. అందరూ సచ్చీలురు. సహృదయలు.
కట్ చేస్తే..
అసలు మతలబు ఇక్కడే ఉంది. కూటమి పార్టీలు ఏ పార్టీనైతే తిట్టిపోస్తున్నారో.. కూటమి పార్టీ అధినేతలు తెల్లారితే .. ఏ పార్టీ నాయకులను ఎండగడుతున్నారో.. ఇప్పుడు అదే పార్టీ వైసీపీ నేతలతో టీడీపీ, జనసే న నాయకులు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. దీనికి ఆధారాలు.. సాక్ష్యా లు.. కావాలంటే.. తాజాగా జరుగుతున్న మద్యం నూతన విధానమే ప్రత్యక్ష ఉదాహరణ. అనేక నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు-వైసీపీ నాయకులు చేతులు కలిపారు.
మీకింత-మాకింత.. అని వాటాలు వేసుకున్నారు. టీడీపీ నాయకులు పెట్టుబడి పెట్టలేని చోట, టీడీపీ నాయకులకు ఎక్కువైన చోట.. వైసీపీనాయకులు రంగంలోకి దిగారు. మేమున్నాం.. మీకు బెంగలేదు! అని చేతులు కలుపుకొన్నారు. దీనికి కారణం.. వేరేవారు, కూటమిలోనే వేరే పార్టీ వారు.. ఈ చాన్స్ కొట్టేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే.... ఎవరో ఊళ్లు పంచేసుకున్నట్టుగా.. ఇరు పార్టీల నాయకులు వ్యాపారాన్ని షేర్ చేసుకున్నారు.
కథ ఇక్కడితో అయిపోలేదు. తాజాగా సోమవారం నుంచి గ్రామ స్థాయిలో 4వేల కోట్ల రూపాయల మొత్తం వ్యయంలో రహదారులను నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కానీ, తెరదీసి చూస్తే.. ఇక్కడ కూడా వైసీపీ నాయకులే దర్శనమిస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నాయకులు కలిసి పోయి.. `ప్రజాస్వామ్య యుతంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నా రు`. చిత్రంగా అనిపించినా నిజం.మెజారిటీ పనులను టీడీపీ, వైసీపీ కాంట్రాక్టర్లు పంచుకున్నారు. సో.. ఇంతకీ చెపేదేంటంటే.. వైసీపీ-టీడీపీ అలానే తిట్టుకుంటాయి. కానీ, రాజకీయాలు మాత్రం కామన్‌గానే సాగిపోతాయి. గతంలోనూ.. ప్రస్తుతంలోనూ.. పరిస్థితి ఇంతే!!