లోక్ సభ రద్దు...సంచలనం దిశగా కేంద్రం...?
మరో ఏడెనిమిది నెలలు ఉండగానే రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అంటే ఢిల్లీలో చకచకా జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన పదవీకాలం మరో ఏడెనిమిది నెలలు ఉండగానే రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అంటే ఢిల్లీలో చకచకా జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. ఈ నెల 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో లోక్ సభ రద్దు అన్నది కీలకమైన సంచలన నిర్ణయం అని అంటున్నారు.
ఇక బీజేపీ కొన్ని హామీలను కూడా ఈ ప్రత్యేక సమావేశాలలో నెరవేరుస్తుంది అని అంటున్నారు యూనీఫారం సివిల్ కోడ్ తో పాటు జమిలి ఎన్నికల అంశం మీద చర్చతో పాటు ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలుగా తీసుకుని రావడానికి ఈ ప్రత్యేక సమావేశాలను వాడుకుంటారు అని అంటున్నారు
ఇక చివరిగా లోక్ సభ రద్దుకు కేంద్రం ఇదే స్పెషల్ సెషన్ లో ప్రతిపాదిస్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా లోక్ సభను రద్దు చేయడం ద్వారా ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెట్టేలా పావులు బీజేపీ పావులు కదుపుతుంది అని అంటున్నారు. దేశంలో దాదాపుగా డజన్ కి పైగా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే సమయంలో ఉంటాయని అంటున్నారు.
మొత్తంగా చూసుకుంటే లోక్ సభ రద్దుకు బీజేపీ సిద్ధంగా ఉందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక క్యాబినేట్ కార్యదర్శులు, వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉందాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేయదం విశేషం.
ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేనిదే ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లరాదని కూడా ఆదేశించింది. ఇక జమిలి ఎన్నికలు అంటే దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణా మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ వంటి చోట్ల కూడా ఎన్నికలు ఒకేసారి ఫిబ్రవరిలోనే ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అంటే డిసెంబర్ లో ఈ అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు తేడా కొడితే విపక్ష కూటమిని ఊపు వస్తుందని ఆ చాన్స్ వారికి ఇవ్వకుండా ప్రజా తీర్పు ఏంటో తెలియక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా మోడీ ఇమేజ్ ని ఉపయోగించుకుని మరోమారు అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది అని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే సెప్టెంబర్ నెల దేశ రాజకీయాలలో అత్యంత కీలకం కాబోతోంది అని అంటున్నారు. లోక్ సభను రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు, కానీ బీజేపీ ఇపుడు ఆ సంచలన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.