మరోసారి సీరియస్ అయిన మాధురి... ఊరుకోనంటూ వార్నింగ్!

అవును... తిరుమల మాడవీధిలో దువ్వాడ శ్రీనివాస్ - మాధురి ల ప్రీవెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధిలో జరిగిందంటూ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో వార్త చూసినట్లు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు మాధురి.

Update: 2024-10-09 06:19 GMT

దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్ ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలల క్రితం ఎంతటి సంచలనాలు సృష్టించిందనేది తెలిసిన విషయమే. ఈ వ్యవహారంలో మాధురి అనే మహిళ పాత్ర కూడా కీలకంగా ఉందనే చర్చ బలంగా నడిచింది. ఈ సమయంలో తాజాగా తిరుమలలో కనిపించారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. దీంతో... వీరికి సంబంధించిన వార్తలో మరోసారి హల్ చల్ చేశాయి!

సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ - మాధురి! ఈ సమయంలో శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి షూట్ జరిగిందంటూ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. కొండపై ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ నెట్టింట ప్రచారం బలంగా మొదలైంది! అయితే ఈ వార్తలను ఖండిస్తూ మాధురి ఓ వీడియోను విడుదల చేశారు.

అవును... తిరుమల మాడవీధిలో దువ్వాడ శ్రీనివాస్ - మాధురి ల ప్రీవెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధిలో జరిగిందంటూ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో వార్త చూసినట్లు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు మాధురి. ఈ సందర్భంగా ఆమె ఆ ఛానల్ పై తీవ్ర విమర్శలు గుపిస్తూ.. ఛాలెంజ్ లు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపారు!

ఆ వీడియోలో మాధురి మాట్లాడుతూ... "ఏమిటా న్యూసు.. రాసేముందు ముందూ వెనుకా ఆలోచించుకుని రాయరా.."? అని ప్రశ్నించారు. నిజాలు రాయండి.. అంతే కానీ, మీకు తోచింది, మీకు నచ్చింది, ఇతరులపై బురద చల్లాలని, ఇష్టమొచ్చిన వార్తలు రాయడం అనేది చాలా తప్పు అని సూచించారు.

న్యూస్ ఛానల్స్ అనేవి నిజాలు జనాలకు చూపించేవిగా ఉండాలి కానీ.. పనికిమాలిన న్యూస్ రాయడానికి కాదని రియాక్ట్ అయ్యారు. ఒకవేళ తాము నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటే రాయాలని.. ఇష్టం వచ్చినట్లుగా వార్తలు పోస్ట్ చేయడం వల్ల అవతలి వ్యక్తి మనసు ఎంత బాధపడుతుందనేది గ్రహించరా అంటూ మాధురి ప్రశ్నించారు.

ఇదే సమయంలో తానొక్కరిదే కాదని, చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానాలు చేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయొద్దని.. తాను సదరు ఛానల్ పై చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటానని తెలిపారు. తాము ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నట్లు ప్రూవ్ చేస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు.

ధమ్ముంటే దువాడ శ్రీనివాస్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఇలాంటి వార్తలతో డీఫేం చేయాలని ప్రయత్నించొద్దని ఆమె హితవు పలికారు. తిరుమలను ఎంతో పవిత్రంగా భక్తులంతా భావిస్తారని.. అలాంటి చోట ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారంటూ రాసే వార్తల వల్ల వారందరి మనోభావాలు దెబ్బతింటాయని చెబుతు.. ఆ కథనాలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు!!

Full View
Tags:    

Similar News