గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన రీల్ చూశారా.. ఫ్రమ్ ఇండియా!
ఇలా రీల్స్ చేయడం, సోషల్ మీడియాకు ఆతుక్కుపోవడం వంటి విషయాల్లో చిన్నా, పెద్దా అనే తారతమ్యాలు లేవని అంటారు.
ప్రదేశం ఏదైనా, సిట్యువేషన్ మరేదైనా కాస్త వీలు కుదిరితే ఓ రీల్ చేసెయ్యడం.. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసెయ్యడం.. వచ్చిన వ్యూస్ లెక్కేసుకుంటూ, కామెంట్స్ చదువుకుంటూ, లైక్స్ వైపు చూస్తూ గడపడం చాలా మందికి ఇప్పుడు ఒక అలవాటుగా కాదు కాదు వ్యసనంగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా రీల్స్ చేయడం, సోషల్ మీడియాకు ఆతుక్కుపోవడం వంటి విషయాల్లో చిన్నా, పెద్దా అనే తారతమ్యాలు లేవని అంటారు. పలు నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.2 బిలియన్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తూ గడిపేస్తుంటారు. ఇక 2024లో సుమారు 280 మిలియన్ల మందికి పైగా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేశారని చెబుతున్నారు.
ఈ విధంగా సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి అవసరంగా, ప్రవృత్తిగా, ఇంకొంతమందికి ఆదాయ వనరుగా, చాలా మందికి వ్యసనంగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ ఉన్న రీల్ ఏమిటనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఆ రీల్ చేసిన వ్యక్తి భారతీయుడు కావడం గమనార్హం.
అవును... కేరళకు చెందిన వ్యక్తి చేసిన వాటర్ ఫాల్ రీల్ ఇప్పటివరకూ సుమారు 554 మిలియన్ వ్యూస్ సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి జలపాతం వద్ద ఉన్న రాళ్ల మధ్య ఫుట్ బాల్ ను పర్ఫెక్ట్ గా తన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. ఫలితంగా.. 55.4 కోట్ల వ్యూస్ తో పాటు 8.4 లక్షల లైక్స్ సంపాదించింది.
ఇలా ఇన్ని వ్యూస్ వచ్చిన ఈ రీల్ తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా స్పందించిన గిన్నీస్ బుక్.. ప్రపంచంలో మరే రీల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రాలేదని చెప్పుకొచ్చింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి!