మోడీ ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం.. కోవిడ్ సేవలను గుర్తించి..

ఎన్నో జాతీయ అవార్డులు, ఎన్నో విశిష్ట అవార్డులు ఆయన సొంతం అయ్యారు. అలాంటి మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Update: 2024-11-14 09:25 GMT

ప్రపంచ వ్యాప్తంగా మోడీకి ఉన్న చరిష్మా అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాధిపతులకు ఆయనంటే గౌరవం, భయం కూడా. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సైతం ఆపగలిగేంత శక్తి ఆయనలో ఉంది. ఈ మాటలు స్వయానా రెండేళ్లు కొట్లాడుకుంటున్న రష్యా-ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులే ప్రకటించారు. భారత మోడీ ఎంతో శక్తిమంతమైన వ్యక్తి అని.. ఆయన తలచుకుంటూ ఈ యుద్ధాన్ని ఆపగలరని ప్రకటనలు ఇచ్చారు.

అటు సొంత దేశంలోనూ మోడీని లైక్ చేయని వారు ఉండరు. దేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడడంలో ఆయనకు ఆయనే సాటి అనేది అందరికీ తెలిసిందే. మోడీ ఉండడం వల్లనే భారత్‌నే ఏ దేశం కూడా టచ్ చేయడం లేదన్న భావన అందరిలోనూ ఉంది. అంతేకాదు.. కష్టకాలంలోనూ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతో సాహసోపేతం అని అందరూ అంటుంటారు. అందుకే ఇప్పటివరకు అగ్రదేశం అయిన అమెరికా సైతం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్నా.. భారత్ మాత్రం ఇంతవరకు అంతటి పరిస్థితికి దిగజారలేదు.

ఇప్పటికే మోడీ సేవలను, మోడీ పలుకుబడిని గుర్తించిన పలు దేశాలు ఆయనకు ఎన్నో సత్కారాలు, పురస్కారాలు ఇచ్చాయి. ఎన్నో జాతీయ అవార్డులు, ఎన్నో విశిష్ట అవార్డులు ఆయన సొంతం అయ్యారు. అలాంటి మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా మోడీకి అత్యున్నత జాతీయ గౌరవాన్ని ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన కృషికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్-డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ మోడీ విశిష్ట కృషి చేశారని, ఆయన చేసిన అంకితాభావానికి తాము డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రదానం చేస్తున్నట్లుగా ప్రకటించింది.

చిన్న దేశం, ద్వీప దేశమే అయిన డొమినికా భారత ప్రధానిని తమ దేశ అత్యున్నత జాతీయ గౌరవంతో సత్కరించనున్నట్లుగా చెప్పింది. రాబోయే ఇండియా-కారికోమ్ సమ్మిట్ సమయంలో దీనిని అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మోడీ సహకారం, కరేబియన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి మోడీ చేసిన కృషిని కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రధాని మోడీ ‘వ్యాక్సిన్ మైత్రి’ ప్రచారం కింద డొమినికా, ఇతర కరేబియన్ దేశాలకు వ్యాక్సిన్లను పంపించారు. భారతదేశం చేసిన ఈ దాతృత్వానికి ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి. దీని కారణంగా భారత్ గ్లోబల్ ఇమేజ్ సాధించింది.

Tags:    

Similar News