నో మొహమాటమ్స్.... భారత్ కు బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన ట్రంప్!
ఈ సందర్భంగా... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపైనా ప్రతీకార సుంకాలూ విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇళ్లు అంతే దూరం.. అని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవని చెబుతున్నారు. తాజాగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రంప్ భారత్ కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి డొనాల్డ్ ట్రంప్ నోట ఎక్కువగా వినిపించిన మాట "సుంకాలు" అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ విషయంలో భారత్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ కామెంట్స్ చేసేవారు. ఇందులో భాగంగా... భారత్ ను ట్రంప్ "సుంకాల రాజు"గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ పర్యటన నేపథ్యంలో మరో బిగ్ షాకిచ్చారు.
ఈ సందర్భంగా... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపైనా ప్రతీకార సుంకాలూ విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. భారత్ లో వ్యాపారం చేయడం కష్టం అని.. ఈ విషయం తెలియక మస్క్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని ట్రంప్ తెలిపారు.
విదేశీ వాణిజ్యంలో న్యాయమైన ప్రయోజనాల కోసం ప్రతీకార సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంటే.. అమెరికా దిగుమతులపై ఏ దేశాలు ఎంతెంత సుంకాలు వసూలు చేసినా.. తిరిగి ఆయా దేశాలపై అమెరికా సుంకాలు విధిస్తుందన్నమాట. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ నొక్కి చెప్పారు.
ట్రంప్ విధించిన ప్రతి సుంకాల ప్రభావం ప్రధానంగా భారత్, బ్రెజిల్, వియాత్నాంతోపాటు తూర్పు ఆసియా, ఆఫిక్ర దేశాలపై పడనుందని అంటున్నారు. వాస్తవానికి.. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున 3 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే.. భారత్ మాత్రం 9.5 శాతం సుంకాలను విధిస్తోంది!
సరిగ్గా ఈ విషయాలపైనే ట్రంప్ మొదటి నుంచీ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైనా 9.5 శాతం సుంకాలు విధించనున్నారని అంటున్నారు. భారత్ పెంచితే ట్రంప్ పెంచుతారు.. భారత్ తగ్గిస్తే ట్రంప్ తగ్గిస్తారన్నమాట.