మగ్‍ షార్ట్ ను ఆ విధంగా క్యాష్ చేసుకుంటున్న ట్రంప్...!

నాయకులు అనేవారు నిధుల సేకరణ చేపట్టాలే కానీ.. అందుకు సవాలక్ష ఛాన్సులతోపాటు.. వివరాలు కూడా లక్షల్లోనే ఉంటాయని అంటుంటారు

Update: 2023-08-28 09:10 GMT

నాయకులు అనేవారు నిధుల సేకరణ చేపట్టాలే కానీ.. అందుకు సవాలక్ష ఛాన్సులతోపాటు.. వివరాలు కూడా లక్షల్లోనే ఉంటాయని అంటుంటారు. ఇందులో భాగంగా తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే పనికి పూనుకున్నారు. అయితే... అందుకు ఆయన ఆయుధంగా వాడిన విషయమే ఈ సమయంలో హాట్ టాపిక్ గా మారింది.

అవును.. జార్జియాలో ట్రంప్ పై నేరారోపణలతో ఆయన లోంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ 20 నిమిషాల పాటు జైలులో గడిపారు. అనంతరం రెండు లక్షల డాలర్ల పూచీ కత్తుతో బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మగ్ షార్ట్ దిగాల్సి వచ్చింది.

అమెరికాలో అరెస్ట్ తర్వాత నిందితులను ఫొటో తీస్తారు. దీన్నీ మగ్ షాట్ గా పిలుస్తారు. ఈ క్రమంలో ట్రంప్ కూడా మగ్ షాట్ దిగారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోను ఆయన ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారని అంటున్నారు. దీంతో ఆ మగ్ షాటే ఆయనకు కోట్లు తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.

దీంతో... ట్రంప్ మగ్ షార్ట్ తో కూడిన బంపర్ స్టిక్కర్లు, టీషర్లు, బీర్ కూజీలు, పోస్టర్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ట్రంప్ తన మగ్ షాట్‌ ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని స్థానిక మీడియా నివేదించింది. ఈ సమయంలో ట్రంప్ సుమారు ఏడు మిలియన్ డాలర్లు సంపాదించి ఉండొచ్చని అంటున్నారు.

అట్లాంటా జైలులో 20 నిమిషాలపాటు గడిపిన ట్రంప్ అనంతరం విడుదలయ్యారు. ఈ సమయంలో ఆయన విడుదలైన గంటన్నర తర్వాత అతని మగ్ షాట్‌ తో కూడిన టీ-షర్టులు, కూజీలు, బంపర్ స్టిక్కర్‌ లను కలిగి ఉన్న వస్తువులు కొనుగోలు చేయడానికి అందుబాటులో వచ్చేశాయి. ఈ సమయంలో ఆ షర్టుల ధర 34 డాలర్లుగా ఉండగా... టీషర్ట్ పై "ఎవరు లొంగిపోవద్దు!" అనే నినాదం ముద్రించబడి ఉంది!

కాగా... 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ట్రంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట ట్రంప్ లొంగిపోయారు. ఆ సమయంలో ఆయన జైలులో 20 నిమిషాల పాటు ఉన్నారు.

అనంతరం 2 లక్షల డాలర్ల విలువైన బాండ్‌ ను సమర్పించి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన ఫోటోను పోలీసులు తీశారు. దీన్ని మగ్ షాట్ అంటారు. ప్రస్తుతం దీన్ని ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో ట్రంప్ ఉన్నారు.

Tags:    

Similar News