ప్రియుడితో పెళ్లికి కట్నంగా బీఎండబ్ల్యూ కారు.. 15 ఎకరాల భూమి!
ప్రియుడి ఇంటి తరఫు వారు కోరిన కట్నం ఇవ్వలేక.. మనస్తాపానికి గురైన యువ వైద్యురాలు తనను తాను చంపేసుకున్నారు.
కాలం మారింది. చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి. అయినప్పటికీ కొందరు చదువుకున్న మూర్ఖులు వ్యవహరించే తీరు.. వారి కారణంగా చోటు చేసుకునే విషాద ఉదంతాల్ని చూసినప్పుడు.. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్న భావన కలుగక మానదు. తాజాగా అలాంటి ఉదంతమే కేరళ రాష్ట్రంలోపురంలో ని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. అయితే.. దీనికి కారణం.. ప్రేమించిన ప్రియుడు పెళ్లి సందర్భంగా ఇవ్వాల్సిన కట్నం వివారల్ని చెప్పటమే.
వారు కోరిన కట్నం ఇచ్చుకోలేక.. మానసిక వేదనతో తనను తాను చంపుకున్న వైనం నోటమాట రాకుండా చేసింది. ప్రియడ్ని పెళ్లి చేసుకోవటం కోసం బీఎండబ్ల్యూ కారు.. 15 ఎకరాల భూమితో పాటు.. 150 సవర్ల బంగారం ఇవ్వాలని ప్రియుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అంత కట్నాన్ని ఇచ్చుకోలేని సదరు యువ వైద్యురాలు సూసైడ్ చేసుకున్నారు.
ప్రియుడి ఇంటి తరఫు వారు కోరిన కట్నం ఇవ్వలేక.. మనస్తాపానికి గురైన యువ వైద్యురాలు తనను తాను చంపేసుకున్నారు. ఆమె ఆత్మహత్యను విచారించిన పోలీసలు ఈ విషయాన్ని గుర్తించారు. అనంతరం విచారణలో నిందితుడి తప్పును గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలు అందిస్తున్న అతడ్ని సస్పెండ్ చేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా అబ్బాయిలు వరకట్నాన్ని అడిగితే.. ఆ అబ్బాయితో పెళ్లికి అమ్మాయిలు రిజెక్టు చేయాలనికోరారు.
తిరువనంతపురానికి చెందిన 26 ఏళ్ల డాక్టర్ షహానా ప్రభుత్వ వైద్యకళాశాలలో డాక్టర్ గా పని చేస్తున్నారు.తల్లి.. ఇద్దరు సోదరులతో కలిసి జీవిస్తున్న ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మరణించారు. ఆమె పని చేస్తున్న ఆసుపత్రిలోనే డాక్టర్ గా పని చేస్తున్న రువాయిస్ ఆమెను ప్రేమించి.. ఆ విషయాన్ని తెలియజేశారు. దీనికి ఆమె ఓకే చేవారు. అయితే.. పెళ్లి వరకు వచ్చేసరికి మాత్రం వరకట్నం కోసం బీఎండబ్ల్యూ కారు.. 15 ఎకరాల భూమితో పాటు.. 150 సవర్ల బంగారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పటం.. అంత ఆర్థిక స్తోమత లేని కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో నిందితుడి ఉన్న వైద్యుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. ఈ ఆత్మహత్య కేరళలో సంచలనంగా మారింది.
బాధితురాలి కుటుంబానికి కేరళ ప్రభుత్వంలోని వివిధ విభాగాలు అండగా నిలిచాయి. మరోవైపు బాధితురాలి సోదరి షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. అడిగినంత కట్నం ఇవ్వని వైనాన్ని హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ప్రేమించిన వ్యక్తి కోసం అతడు నిలబడతాడని తాము భావిస్తే.. అతను మాత్రం నీ కంటే డబ్బే ముఖ్యమని చెప్పేయటంతో తట్టుకోలేక తన సోదరి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.