ఎంపీలకు ఉండే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

ఈ నేపథ్యంలో ఎంపీలకు ఉండే జీతభత్యాలు, అలవెన్సులు, ప్రత్యేక ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు.

Update: 2024-06-11 01:30 GMT

ఇటీవల లోక్‌ సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులోని రెండు సభలయిన రాజ్యసభలో 250 మంది, లోక్‌ సభలో 545 మంది ఎంపీలు ఉంటారు. మొత్తం రెండు సభలు కలిపి 795 మంది ఎంపీలు ఉంటారు. దేశ ప్రధాని కూడా ఈ రెండు సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడై ఉండాలి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌ సభ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన వారణాసి నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ఎంపీలకు ఉండే జీతభత్యాలు, అలవెన్సులు, ప్రత్యేక ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు.

ఒక్కో ఎంపీకి జీతం కిం నెలకు రూ. 1,00,000 ఇస్తారు. అలాగే

జీతం కాకుండా, ఎంపీలు తమ కార్యాలయ నిర్వహణకు, ఇతర ఖర్చులకు నెలకు రూ. 70,000 భత్యం అందుతుంది. ఇవి కాకుండా ఆఫీస్‌ ఖర్చు, స్టేషనరీ, సిబ్బంది జీతాలకు రూ.60 వేల వరకు ఇస్తారు.

పార్లమెంటరీ సమావేశాలు, పార్లమెంటు కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు ఢిల్లీలో ఉన్నప్పుడు బస, ఆహారం, ఇతర ఖర్చులకు రోజుకు రూ.2 వేలు ఇస్తారు. ప్రతి ఎంపీకి ఢిల్లీలో నివాస సదుపాయం కల్పిస్తారు. ప్రత్యేకంగా క్వార్టర్స్‌ కేటాయిస్తారు.

ఎంపీలకు వారి 5–సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రాంతాలలో అద్దె లేకుండా వసతి కల్పిస్తారు. సీనియారిటీని బట్టి వారు బంగ్లాలు, ఫ్లాట్లు లేదా హాస్టల్‌ గదులు లభిస్తుంది. అధికారిక వసతికి బదులుగా నెలకు రూ. 2,00,000 గృహ భత్యాన్ని పొందొచ్చు.

ఏటా ఎంపీలకు 50 వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 4 వేల కిలో లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తారు.

ఒక్కసారి ఎంపీ అయ్యాక పదవీ కాలం ముగిశాక నెలకు రూ. 25,000 పెన్షన్‌ అందుతుంది. ఈ మొత్తానికి ఆ తర్వాత ప్రతి అదనపు సంవత్సరానికి నెలకు రూ. 2,000 చొప్పున ఇంక్రిమెంట్‌ కూడా ఉంటుంది.

ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు ఉంటాయి. వారు అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్‌–క్లాస్‌ రైలు ప్రయాణాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అలాగే వారి నియోజకవర్గాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు రవాణా ఖర్చులను కూడా క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చు.

ఎంపీలు ఒక సంవత్సరంలో 1,50,000 ఉచిత టెలిఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. వారి నివాసాలు, కార్యాలయాలలో ఉచిత హై–స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సౌకర్యం కూడా ఉంటుంది.

Tags:    

Similar News