బీజేపీలో ఆజాత శత్రువు అద్వానీ

ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డు అందజేశారు.

Update: 2024-03-31 09:14 GMT

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డు అందజేశారు. భారత రాజకీయాల్లో తిరుగులేని నేతగా వ్యవహరించిన అద్వానీ ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రధాని అటల్ బిహారీ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

భారతీయ జనతా పార్టీలో 90వ దశకంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 96 ఏళ్ల వయసులో ఆయనకు ఈ అవార్డు రావడం గర్వకారణమే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారం ప్రదానం చేశారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పలు పదవులు పొందారు. బీజేపీలో ఆయన ప్రాధాన్యం ఎంతో ఉండేది. ప్రభుత్వ మనుగడలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకునే వారు.

ప్రధాని కావాలని ఆశ అద్వానీకి ఉండేది. పరిస్థితులు అనుకూలించక అలాంటి పరిణామాలు అనుకూలించలేదు. దీంతో అద్వానీకి ప్రధాని కావాలనే కల మాత్రం తీరలేదు. రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న అద్వానీకి ప్రస్తుతం భారతరత్న పురస్కారం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను కోరుకున్న పదవి దక్కకపోయినా దేశ అత్యున్నత పురస్కారం దొరకడం మంచిదే.

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం ఎల్ కే అద్వానీ కీలక నేతగా వ్యవహరించారు. అప్పట్లో వాజ్ పేయి తరువాత స్థానం అద్వానీదే అని తెలుసు. అలా ప్రభుత్వ నిర్వహణలో కీలక నేతగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల అమలులో తనదైన ముద్ర వేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా అద్వానీ పాత్రే అధికంగా ఉందనే విషయం తెలుసు. ఇలా అద్వానీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు.

మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ప్రలోభాలకు లొంగలేదు. పదవుల కోసం పని చేయలేదు. తనదైన నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు నడిపించిన ఘనత ఆయనదే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాత్రను ఆనాడు అద్వానీ పోషించారు. బీజేపీ నావకు మార్గదర్శకం చేసిన నేతగా ఎన్నో పదవులు అనుభవించారు. భారతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతగా ఖ్యాతి గడించారు.

Tags:    

Similar News