బిగ్ బ్రేకింగ్... వాలంటీర్ల విషయంలో ఈసీ మరో సంచలన నిర్ణయం!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో వృద్ధులకు పెన్షన్స్ ఇప్పించకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ఒక సంస్థ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆ విషయంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! ఇదే సమయంలో తాజాగా రేషన్ పంపిణీలోనూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది!
అవును... ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్... తాజాగా రేషన్ పంపిణీ విషయంలోనూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (వీఆర్వో) లు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఇదే క్రమంలో... ఎండియూ ఆపరేటర్లు కూడా.. వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది.
నేటి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి రాగా... ఉల్లంఘించినవారిపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోనుందని తెలుస్తుంది.
కాగా... పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. దీనిపై స్పందించిన హైకోర్టు ఈసీకి ఆదేశాలు జారీ చేయడం.. దీంతో ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే! ఆ ఆదేశాలు వచ్చి ఉండకపొతే.. ఈ సమయానికి పెన్షన్ల పంపిణీ ఆల్ మోస్ట్ పూర్తయిపోయేదని వైసీపీ నేతలు అంటున్నారు! ఈ నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకునే ప్రత్యామ్నాయాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరోపక్క.. చంద్రబాబు తన సన్నిహితులతో కలిసి తెరవెనుక చేసిన రాజకీయంలో భాగంగానే నేడు వృద్ధులు, వికలాంగులు ఎండలోపడి పెన్షన్స్ కోసం వెళ్లాల్సి వస్తుందంటూ వైసీపీ మొదలుపెట్టేసింది. చంద్రబాబు పాలనలో పెన్షన్ దార్లు పడిన ఇబ్బందులను మరోసారి ప్రజలు అనుభవిస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో... రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లను ఇన్ వాల్వ్ చేయొద్దని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.