ఎగ్ తినాలంటే ఇండియాలోనే ఉండండి... బయట ధరలు తెలిస్తే షాకే!

అవును... కోడిగుడ్డు తినాలనుకునేవారికి ఇండియా అంత స్వర్గధామం లేదని అంటున్నాయి తాజా నివేదికలు.

Update: 2023-10-14 14:39 GMT

పట్నానికి వెళ్తే కానీ పల్లె విలువ తెలియదని, విదేశానికెళ్తే కానీ స్వదేశం గొప్పతనం అర్ధం కాదని అంటుంటారు. మిగిలిన విషయాల్లో సంగతి కాసేపు పక్కనపెడితే... కోడి గుడ్లు తినే విషయంలో మాత్రం ఇది కాస్త గట్టి నిజమనే అనుకోవాలి. కారణం... కొన్ని దేశాల్లో డజను ఎగ్స్ కొనే ధరతో ఇండియాలో నాలుగైదు ఎగ్ బిర్యానీలు వస్తాయంటే అది అతిశయోక్తి కాదు. అలా ఉన్నాయి అక్కడ కోడి గుడ్డు ధరలు.


అవును... కోడిగుడ్డు తినాలనుకునేవారికి ఇండియా అంత స్వర్గధామం లేదని అంటున్నాయి తాజా నివేదికలు. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఇప్పుడు కోడిగుడ్డు ధర 6 రూపాయలు అయితే... ఆ ధర ఆకాశంలో ఉన్న టాప్ 10 దేశాల సంగతి ఇప్పుడు చూద్దాం! ప్రస్తుతం ప్రపంచంలో కోడిగుడ్డు ధర అత్యధికంగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ డజన్ ఎగ్స్ 560 రూపాయలు. అంటే ఒక్కో గుడ్డు ధర రూ. 46.60 అన్నమాట.

ఇక డజన్ ఎగ్స్ రూ. 456తో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కో గుడ్డు ధర 38 రూపాయలు. ఇక రూ.359తో మూడోస్థానంలో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ ఒక గుడ్డు ధర 29.91 రూపాయలు కాగా... దాదాపు అదేధరతో డెన్మార్క్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా గుడ్డు ధర రూ. 29.92! ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా ఉంది. ఇక్కడ గుడ్డు ధర రూ. 28.33. అంటే... డజన్ గుడ్ల ధర 340 రూపాయలు అన్నమాట.

ఇక డజన్ ధర రూ. 335.09 తో లుగ్జెంబర్ ఉండగా... డజన్ గుడ్ల ధర 333.74 రూపాయలతో ఉరుగే దేశం ఏడో స్థానంలో ఉంది. ఇదే జాబితాలో కోడిగుడ్డు తక్కువ ధర ఉన్న దేశాల్లో డజన్ గుడ్ల ధర 79 రూపాయలతో ఇండియా ఉండగా... రష్యాలో డజన్ ఎగ్స్ ధర 84 రూపాయలుగా ఉంది. ఇక పక్కనున్న పాకిస్థాన్ లో డజన్ ఎగ్స్ 90 రూపాయలు గా ఉంది!

Tags:    

Similar News