పేరులో తల్లిపేరును చేర్చుకున్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి తల్లి పేరు గంగూబాయి కాగా తండ్రి పేరు సంభాజీ. తాజాగా వీరిద్దరి పేర్లను కలుపుతూ నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు.

Update: 2024-03-14 04:21 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నంతనే ఏక్ నాథ్ శిందే అన్న మాట చప్పున చెప్పేస్తారు చాలామంది. ఇకపై అలా చెబితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. తాజాగా ఆ రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం తన పేరులో తన తల్లి పేరును చేర్చుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్లే ముఖ్యమంత్రి నామ ఫలకంలోనూ మార్చిన కొత్త పేరుతో తయారు చేయించి ఏర్పాటు చేశారు. ఇకపై ఆయన్ను.. "ఏక్ నాథ్ గంగూబాయి సంభాజీ శిందే"గా వ్యవహరించాల్సి ఉంటుంది.

2024 మే ఒకటో తేదీ నుంచి పుట్టిన వారికి జారీ చేసే ప్రభుత్వ పత్రాల్లో తండ్రి పేరుతో పాటు తల్లి పేరును చేర్చాలంటూ కొత్త నిర్ణయాన్ని ఏక్ నాత్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందుకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకన్నారు. పిల్లల్ని పెంచి వారిని ప్రయోజకుల్ని చేయటంలో తల్లుల పాత్ర ఎంతో కీలకమని.. అందుకే వారి పేరును చేర్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రి తల్లి పేరు గంగూబాయి కాగా తండ్రి పేరు సంభాజీ. తాజాగా వీరిద్దరి పేర్లను కలుపుతూ నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని.. తనతోనే షురూ చేయాలని భావించారు మహా ముఖ్యమంత్రి. అందుకే ఆయనతన పేరులో తన తల్లి పేరు (గంగూబాయి)ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసే నేమ్ ప్లేట్ ను తాజాగా మార్చారు.

ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలోనూ తెలియజేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్.. అజిత్ పవార్ పేర్లలోనూ వారి తల్లుల పేర్లను మారుస్తూ.. అధికారిక ప్రాంగణాల్లో నేమ్ ప్లేట్లను మార్చేశారు.

Tags:    

Similar News