అమెరికాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఏమిస్తారు?
అన్ని పనులూ మానుకుని పోలింగ్ తేదీ వరకూ ప్రచార కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటారన్నా అతిశయోక్తి కాదేమో!
సాధారణంగా మన దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నాయకులతో పాటు అంతకు మించి అన్నట్లుగా కార్యకర్తల్లోనూ, అభిమానుల్లోనూ ఆ సందడి నెలకొంటుంటుంది. అన్ని పనులూ మానుకుని పోలింగ్ తేదీ వరకూ ప్రచార కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటారన్నా అతిశయోక్తి కాదేమో!
ఈ సమయంలో... మనదేశంలో ఎన్నికల ప్రచారాకలు వెళ్తే ఉదయం పార్టీ ఆఫీస్ వద్ద బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం బిర్యానీ విత్ బీర్, పని పూర్తయ్యాక మనీ.. ర్యాలీలు ఉంటే బైక్ పెట్రోల్ అదనం అని అంటుంటారు. ఈ విషయంలో అభ్యర్థి ఆర్థిక పరిస్థితిని బట్టి, అక్కడున్న పోటీ వాతావరణాన్ని బట్టి, ఆఫర్స్ లో హెచ్చు తగ్గులు ఉంటాయని చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఈ సమయంలో వీరి కోసం వేలాది మంది ప్రచార కార్యకర్తలు గత కొన్ని వారాలుగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
దీంతో... అమెరికాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులకు ఏమేమి ఇస్తారు అనే అంశం తెరపైకి వచ్చింది. దీనికి సమాధానంగా అక్కాడున్న పలువురు భారతీయులు స్పందిస్తూ... ఎన్నికల ప్రచారానికి వెళ్తే డబ్బులు తీసుకోవాలనే ఆలోచన ఎవరూ చేయరని అంటున్నారు.
అయితే... ఇలా ప్రచారంలో పాల్గొనే వారికి భోజనం పెట్టి ప్రయాణ ఛార్జీలు మాత్రం ఇస్తారని చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... "ఫండ్ రైజింగ్ మీటింగ్స్" పేరుతో ప్రజల నుంచే రివర్స్ లో డబ్బులు ఆశిస్తారని చెబుతున్నారు.
కాగా.. ప్రస్తుతం అమెరికా అంతటా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు నివేదికల ప్రకారం.. అమెరికా ఎన్నికల కారణంగా ఆయా రాజకీయ సంస్థల ద్వారా సుమారు 25,000 నుంచి 30,000 మంది కార్మికులు ఉపాధి పోందుతున్నారని అంటున్నారు.