లెక్క మారింది... వ్యయ పరిమితి పెంచిన ఎన్నికల కమిషన్!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల వ్యవ పరిమితిని పెంచిందిం ఎన్నికల కమిషన్.

Update: 2024-02-24 07:33 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని పెంచింది. ఇందులో భాగంగా... లోక్‌ సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో రూ.70 నుంచి 95 లక్షలకు... చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో రూ.54 నుంచి 75 లక్షలకు పెంచినట్లు తెలిపింది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల వ్యవ పరిమితిని పెంచిందిం ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని పెంచింది. దీని విషయానికొస్తే... పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలలో రూ.28 నుంచి 40 లక్షలకు.. చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో రూ.20 నుంచి 28 లక్షలకు పెంచుతున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఇదే సమయంలో ఒక్కో నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార వాహనాల సంఖ్యను 5 నుంచి 13కి పెంచిన ఎన్నికల కమిషన్... నామినేషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500.. ఇతరులు రూ.25,000 చొప్పున డిపాజిట్లు చెల్లించాలని తెలిపింది. ఇదే సమయంలో మేనిఫెస్టో ప్రతులను ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాలని సూచించింది.

ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా... వచ్చే ఎన్నికల నుంచి ఈ నూతన వ్యయ పరిమితులు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇదే సమయంలో... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చులు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే క్రమంలో... తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఈసీ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ అభ్యర్థుల వ్యయంలో... రోజువారీగా అభ్యర్థులు చేసే ఖర్చుతోపాటు జెండాలు, పాంప్లెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, టోపీలు, వాహనాల అద్దె, వాటి ఇంధన ఖర్చులు, భోజనాలు, సభా వేదికలు, మైకులు, మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలను నిర్ణయిస్తుంది. ఈ క్రమంలో తాజాగా అభ్యర్థుల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది.

Tags:    

Similar News