ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మెనూ ఇదే!
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ఉద్యోగులకు రెండు రోజులపాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ఉద్యోగులకు రెండు రోజులపాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దానికి అనుగుణంగా విధి విధానాలతో మెనూ రూపొందించింది. ఎన్నికల సిబ్బందికి వేళకు ఆహారం అందించే బాధ్యతలను పర్యవేక్షించాలని పంచాయతీలు, మున్సిపాలిటీలను ఆదేశించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలంగాణలో 17 లోక్ సభ, ఏపీలో 175 శాసనసభ , 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరుకానున్న ఉద్యోగులకు కమీషన్ మెనూను విడుదల చేసింది.
ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకోగానే 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందించాలి
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య భోజనం. ఇందులో అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ వడ్డించాలి.
సోమవారం పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు టీ తో పాటు రెండు అరటి పండ్లు ఇవ్వాలి
ఉదయం 8 నుంచి 9 మధ్య క్యారట్, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ అందించాలి
ఉదయం 11, 12 గంటల సమయంలో మజ్జిగ అందించాలి
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం. ఇందులో కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు అందించాలి
మధ్యాహ్నం 3, 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం అందించాలి
సాయంత్రం 5.30 గంటలకు టీతో పాటు బిస్కెట్లు అందించాలి