మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్ వ్యతిరేక అధ్యక్షుడికే మళ్లీ పగ్గాలు!

దీంతో... తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేక, చైనా అనుకూల అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న మొహమ్మద్ మయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది.

Update: 2024-04-22 07:46 GMT

గతేడాది భారత ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులను భారతీయులు బాయికాట్ చేశారనే కామెంట్లు వినిపించాయి. దీంతో మయిజ్జు ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో తాజాగా అక్కడ ఎన్నికలు జరగడంతో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మయుజ్జు పార్టీ హవా కొనసాగింది!

అవును... గతేడాది భారత ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ముయుజ్జు తిరిగి ఎన్నిక కావడం జరిగే పని కాదని చాలామంది భావించారు! కానీ మాల్దీవులు ప్రజలు మాత్రం భిన్నంగా ఆలోచించారు. దీంతో... తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేక, చైనా అనుకూల అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న మొహమ్మద్ మయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ క్రమంలో... మాల్దీవుల పార్లమెంటు లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో... ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో... 86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా అందులో 60కి పైగా స్థానాలను ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ దక్కించుకుంది. దీంతో మయిజ్జు మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు!

దీంతో ఈ తాజా ఫలితాలు భారత వ్యతిరేకిగా భావించే అధ్యక్షుడు ముయిజ్జూ.. తన విధానాలను వేగంగా ముందుకు తీసుకురావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రజల తీర్పు చైనాకు సంతోషాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో... మోడీపై వ్యాఖ్యల తర్వాత ఈ దేశంపై భారత్ స్పందించిన తీరు అక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News