ఎన్నికల వేళ కొత్త కొలువులు... ఆ నిరుద్యోగులకు భారీ డిమాండ్!
అవును... ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలా వ్యాపారాల వారు బిజీ అయిపోతారని అంటుంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ వంటి రాష్ట్రాల్లో అటు అసెంబ్లీకి, ఇటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలు, మీడియా, సర్వే సంస్థలు మొదలైనవి ఫుల్ బిజీ అయిపోతుంటాయి. ఇదే సమయంలో టెంట్ హౌస్ వ్యాపారాలు, పూల దండల వ్యాపారాలతో పాటు, పార్టీ జెండాలు, టోపీలు తయారు చేసేవారి నుంచి వాహననాలపై స్టిక్కరింగులు చేసే వారూ బిజీ అయిపోతారని అంటుంటారు.
అవును... ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలా వ్యాపారాల వారు బిజీ అయిపోతారని అంటుంటారు. పైగా ఈ ఏడాది ఏపీలో ఎలక్షన్ కోడ్ కి పోలింగ్ తేదీకీ చాలా గ్యాప్ ఉండటంతో ఈ వ్యాపారాలు మరింత బలంగా సాగాయని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ప్రధానంగా ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ... పొలిటికల్ కన్సల్టెంట్స్ వద్ద కీరోల్ ప్లే చేసే డిపార్ట్ మెంట్ లో పలు పట్టబద్రులకు సరైన అవకశాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... గతంలో ఎన్నికలకోసం ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయాలు తీసుకునేది! ప్రచారాలు ఎలా చేయాలి.. బ్యానర్స్ ఎలా డిజైన్ చేయాలి.. టీవీల్లో ప్రకటనలు, ఎన్నికల్లో హామీలు, మేనిఫెస్టో రూపకల్పన మొదలైన విషయాలపై ఆయా రాజకీయ పార్టీలలోని సీనియర్లు, విద్యావంతులు నిర్ణయాలు తీసుకునేవారు! అయితే ఇప్పుడు ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి! ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీల సీజన్ వచ్చేసింది.
పార్టీలో నేతలు ఏమి మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఎంత మేరకు మాట్లాడాలి.. పార్టీ ప్రచార కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి.. ఎవరెవరితో ప్రచారాలు నిర్వహించాలి.. ఎవరెవరిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలి.. పాటలు ఎవరితో పాడించాలి.. ట్వీట్లు ఎలా చేయాలి.. హామీలు ఏమి ఇవ్వాలి.. మేనిఫెస్టోను ఎలా రూపొందించాలి.. ప్రత్యర్థులపై ఏయే అంశాలపై ఏ విధమైన విమర్శలు చేయాలి.. మొదలైన విష్యయాలను ఆయా కన్సల్టెంట్లే నిర్ణయిస్తున్నారని అంటున్నారు.
దీంతో... ఎన్నికలకు వ్యూహాలు రచించే పొలిటికల్ కన్సల్టెన్సీలకు దేశంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే వీటిలో కీ రోల్ ప్లే చేయడానికి స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్స్ అవసరం చాలా ఉంటుంది. దీంతో... ఐఐటీ, ఐఐఎం లలో చదివిన నిరుద్యోగ ఇంజనీర్లు, ఎంబీయే పట్టభద్రులు, యంగ్ లాయర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. ఇక జర్నలిస్టుల సంగతి సరేసరి.. పొలిటికల్ కన్సల్టెన్సీలలో వ్యూహాలు రచించే జర్నలిస్టులకు ఫుల్ డిమాండ్ అని చెబుతున్నారు.
ఈ క్రమంలో... సర్వేలు చేసేవారితోపాటు.. ఆ సర్వే, ఓటర్ల డేటా విశ్లేషిస్తూ పార్టీలకు తగ్గట్లు వ్యూహాలు రెడీ చేయడం, స్థానికంగా నేతల రాజకీయ సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన పనిగా ఉంటుంది! ఇలా బయట ప్రపంచానికి కనిపించకుండా... ఆయా రాజకీయ పార్టీల కోసం, తమను నియమించుకున్న నేతల కోసం తెరవెనుక పనిచేసే ఈ సీక్రెట్ ఆర్మీకి వేతనాలు కూడా భారీగా చెల్లిస్తున్నారని తెలుస్తుంది!