మస్క్.. మరో అద్భుతం.. చూపు లేని వారికీ చూపు !

అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే టెక్నాలజీకి ఉన్న లక్ష్యం.

Update: 2024-09-18 05:54 GMT

అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే టెక్నాలజీకి ఉన్న లక్ష్యం. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇప్పటికే మనిషి మెదడును, గుండెను, కిడ్ని, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తున్నారు. అలాంటిది మరో అద్భుతాన్ని కూడా ‘చూడబోతున్నాం.’

ఎలాన్ మస్క్.. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇప్పటికే టెస్లా కంపెనీ, స్పేస్ ఎక్స్, ఎక్స్‌లతో తన సత్తాచాటుతున్న మస్క్ బ్రెయిన్‌లో చిప్ అమర్చుతామంటూ కొత్తగా చర్చకు దారితీశాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అయింది. మనిషి మెదడలో చిప్ అమర్చడంతో అది ఎలక్ర్టోడ్లు, న్యూరాన్ల ద్వారా పనిచేస్తుంటుంది. ఇప్పటికే దీనిని ఓ మనిషి మెదడులో అమర్చినట్లు మస్క్ చెప్పారు.

ఇప్పుడు ఎలాన్ మస్క్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేసే మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ న్యూరోలింగ్ కంపెనీ త్వరలోనే కంటిచూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు చేపట్టింది. పుట్టుకతోనే చూపు లేని వారికి వైద్యరంగంలో ఎలాంటి ట్రీట్‌మెంట్ లేదు. వారికి మళ్లీ చూపు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కానీ.. అలాంటి వారి కోసం మస్క్ ఈ ప్రయోగానికి తెరలేపారు.

అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు లేదంటే పుట్టుకతోనే చూపు లేని వారు చూడగలిగేలా పరికరం తయారు చేయడంపై ఆయన దృష్టి సారించారు. మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపే భాగంలో ఈ చిప్‌ను అమర్చి అంధులు ప్రపంచాన్ని చూసేలా అవకాశం కల్పించబోతున్నారు. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింక్ పరిశోధకులు వెల్లడించారు.

రెండు నెలల క్రితమే ఆ చిప్‌ను కోతులపై ప్రయోగించగా అది సక్సెస్ అయినట్లు పరిశోధకులు తెలిపారు. చిప్ అమర్చాక ఆ కోతి చనిపోవడం గానీ, గాయపడడం గానీ జరలేదని చెప్పారు. ప్రయోగాత్మక పరికరం అమర్చేందుకు న్యూరాలింక్ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని కూడా పొందినట్లు వెల్లడించారు.

న్యూరాలింక్ రూపొందించే బైండ్ సైట్ పరికరం అంధులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ ప్రయోగం ద్వారా వారు రెండు కళ్లతో చూసే అవకాశం లేకపోయినప్పటికీ ఆప్టిక్ నగరానికి అనుసంధాన చేసిన బ్లైండ్ సైట్ డివైజ్ ద్వారా మాత్రం ప్రపంచాన్ని చూసేందుకు వీలుంటుందని మస్క్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పరికరం వాడడం వల్ల మొదట్లో చూపు ప్రభావం తక్కువగా ఉంటుందని, కొంతకాలానికి సహజమైన కంటిచూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుందని తెలిపారు. ఎంతో ప్రభావితమైన అతినీలలోహిత కిరణాలను కూడా దీని ద్వారా ఎదుర్కోవచ్చని.. ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని పేర్కొన్నారు.

Tags:    

Similar News