47 డాలర్లు... ట్రంప్ కోసం మస్క్ ఓట్లు కొనుగోలు చేస్తున్నారా?

అవును... మొదటి, రెండవ సవరణలకు మద్దతు ఇచ్చే పిటిషన్ పై సంతకం చేయడ్దనికి ఇతరులను సూచించే ప్రతీ నమొదిత ఓటరుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 47 డాలర్లు అందిస్తున్నారు.

Update: 2024-10-09 12:30 GMT

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యే వరకూ అతని వెంటే నడుస్తానంటూ ప్రకటించిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్... డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా మొదలుపెట్టిన తన కొత్త ప్రచారం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. మాట్లాడే స్వేచ్ఛ, ఆయుధాలు ధరించే హక్కుకు మద్దతు ఇచ్చే పిటిషన్ పై సంతకం చేయడానికి ఇతరులను సూచించే ఓటర్లకు $47 ఆఫర్ చేస్తున్నారు.

అవును... మొదటి, రెండవ సవరణలకు మద్దతు ఇచ్చే పిటిషన్ పై సంతకం చేయడ్దనికి ఇతరులను సూచించే ప్రతీ నమొదిత ఓటరుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 47 డాలర్లు అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రధానమైన స్వింగ్ రాష్ట్రాల నుంచి 1 మిలియన్ సంతకాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

వీటిలో ప్రధానంగా పెన్సిల్వేనియా, నెవాడా, జార్జియా, విస్కాన్సిన్, మిచిగాన్, నార్త్ కరోలినా రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో పాల్గొనడానికి చివరి తేదీ అక్టోబర్ 21. ఈ పిటిషన్ స్వేచ్ఛా వాక్చాతుర్యాన్ని, ఆయుధాలు ధరించే హక్కును సమర్ధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రాముఖ్యతను మస్క్ నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల ఏకైక అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా... "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" టోపీని ధరించిన మస్క్.. ట్రంప్ గెలవకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెన్సిల్వేనియాలోని బట్లర్‌ లో జరిగిన ర్యాలీలో మస్క్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల ఏకైక అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ప్రకటించారు . "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" టోపీని ధరించిన మస్క్, " ట్రంప్ గెలవకపోతే ఇదే చివరి ఎన్నికలు ."

కాగా... ఒకరికి ఓటు వేయడాన్నికి చెల్లించడం, లేదా.. ఓటు వేయడానికి నమోదు చేసుకున్నందుకు చెల్లించడం, లేదా.. ఓటు వేసినందుకు చెల్లింపును అంగీకరించడం పరిగణించబడుతుంది. అయితే... పిటిషన్ పై సంతకం చేయడానికి ఓటర్లకు.. లేదా, సంతకం చేయడానికి ప్రజలను ఒప్పించడానికి డబ్బు చెల్లించడం చట్టవిరుద్ధం కాదు!

Tags:    

Similar News