గాలిలో సూపర్ హెవీ బూస్టర్ ను పట్టుకుంది.. స్పేస్ ఎక్స్ వీడియో వైరల్!
ఎలాన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో మరో ఘనత సాధించింది.
అంతరిక్ష ప్రయోగ రంగంలో స్పేస్ ఎక్స్ తన హవా కొనసాగిస్తోంది. వరుసగా పలు సంచలనాలకు తెరలేపుతూ చరిత్ర సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా స్పేస్ ఎక్స్ సంస్థ అంతర్జాతీయ ప్రయోగ రంగంలో సరికొత్త ఘనత సాధించింది. దీంతో.. ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమంటూ సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అవును... ఎలాన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో మరో ఘనత సాధించింది. ఈ సంస్థ తాజాగా ప్రయోగించిన భారీ స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ ఆకాశంలోని దూసుకెళ్లింది.. ఆ తర్వాత తిరిగి లాంచ్ ప్యాడ్ కే సురక్షితంగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది అంతరిక్ష ప్రయోగ రంగంలో అత్యద్భుతం అని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... టెక్సాస్ లోని మెక్సికో సరిహద్దు సమీపం నుంచి రెండు దశల స్టార్ షిప్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాని పొడవు 121 మీటర్లు కాగా.. అందులోని బూస్టర్ పొడవు 71 మీటర్లు. అయితే... నింగిలోకి ఎగిరిన సుమారు 7 నిమిషాల తర్వాత బూస్టర్ తిరిగి భూమిపైకి వస్తూ లాంచ్ టవర్ కు చేరుకోగా.. లాంచ్ టవర్ దాన్ని పదిలంగా ఒడిసి పట్టి చరిత్ర సృష్టించింది.
మరోవైపు స్టార్ షిప్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి.. హిందూ మహాసముద్రంలో దిగింది. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో స్పేస్ ఎక్స్ ఉద్యోగులు కేరింతలు కొట్టారు.. చప్పట్లతో పరిశరాలను మారుమ్రోగించేశారు.
వాస్తవానికి స్పేస్ ఎక్స్ తమ బూస్టర్లను తిరిగి రిసీవ్ చేసుకొవడం కొత్తేమీ కాదు. అయితే... కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి భూమికి తిరిగొచ్చె బూస్టర్లను రికవరీ చేస్తూనే ఉంది. అయితే.. సముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ఫ్లాంట్ ఫ్లాట్ ఫాంలపై అవి ల్యాండ్ అయ్యేవి. అయితే... బూస్టర్ నేరుగా ల్యాచ్ ప్యాడ్ కే తిరిగిరావడం మాత్రం ఇదే తొలిసారి. దీనివల్ల కోట్ల కొద్దీ డబ్బు ఆదా అవుతుంది!