ట్రంప్ మైనస్.. మస్క్ కాపాడతారా?
కానీ, బైడెన్ ప్లేస్‌లోకి కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ అనూహ్యంగా మారిపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు తనకు తిరుగులేదని అనుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత ఆరు మాసాలకు పైగా ఉన్న గ్రాఫ్‌ను చూస్తే.. తాజాగా డౌన్ అయింది. ప్రస్తుత అధ్య క్షుడు జై బైడెన్ పోటీ నుంచి తప్పుకొన్న దరిమిలా.. ట్రంప్ ఆశలు తగ్గుతూ వచ్చాయి. బైడెన్ బరిలో ఉన్న సమయంలో ట్రంప్ చెలరేగిపోయారు. ఎందుకంటే.. బైడెన్ అనారోగ్య సమస్యలు.. ఆయన డిబేట్లలో వ్యవ హరించిన తీరు వంటివి ట్రంప్‌కు కలిసి వచ్చాయి.
కానీ, బైడెన్ ప్లేస్‌లోకి కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ అనూహ్యంగా మారిపోయింది. అయితే.. ఇక్కడకూడా ట్రంప్ పైచేయి సాధించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఫక్తు.. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థి నాయకులు తిట్టుకున్నట్టే తిట్టుకున్నారు. మొత్తంగా చూస్తే.. కమల పైచేయి సాధించారు. ఒక్క డిబేట్లలోనే కాదు.. ఆర్థికంగా విరాళాలు రాబట్టడంలోనూ ఆమె ముందంజలో ఉన్నారు. అయితే.. ఇక్కడ అనూహ్యంగా ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు.
అంతేకాదు.. ఎలాన్ మస్క్ నేరుగా ట్రంప్‌కు ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలకు విరాళాలు ఇవ్వనన్న మస్క్.. అనూహ్యంగా ట్రంప్‌కు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. నెలకు 45 మిలియన్ డాలర్ల విరాళం ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించారు. ఇది ప్రత్యర్థి డెమొక్రాట్లను గుంజాటనలో పడేసింది. ఎందుకంటే.. తమ దగ్గర అంత పెద్ద మొత్తం ఇచ్చే వారు లేకపోవడమే.
ఇలాంటి పరిస్థితి పగ్గాలుచేపట్టిన కమల.. అనూహ్యంగా పుంజుకున్నారు. ఆమెకు విరాళాలు కూడా వచ్చా యి. పరోక్షంగా గూగుల్ సహకరిస్తోంది. మరోవైపు ఇండియన్ కమ్యూనిటీలో ట్రంప్ చీలికలు తెచ్చినా.. తాజాగా జరిగిన డిబేట్ అనంతరం.. ఇండియన్ కమ్యూనిటీ ఆత్మరక్షణలో పడిపోయింది. నిన్న మొన్నటి వరకు బైడెన్‌కు మద్దతు పలికిన ఇండియన్ -అమెరికన్లు.. ఇటీవల మస్క్ మంత్రాంగంతో ట్రంప్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగారు వారు కూడా అంతర్మథనంలో పడ్డారు. ఇక, ఇప్పుడు ట్రంప్‌కు మిగిలిన ఏకైక ఆశ ఎలాన్ మస్క్. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.