పెళ్లి, పిల్లల విషయంలో 12 మంది సంతానం ఉన్న తండ్రి సలహా ఇదే!

ఇందులో ఒకటి సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం కాగా.. మరొకటి వృద్ధ జనాభా పెరిగిపోవడం.

Update: 2024-11-01 23:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకూ ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోతున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి.. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు! దీంతో... ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ.. వారి వారి ప్రజలకు ఈ విషయంలో రిక్వస్టులు చేస్తున్నాయి.. ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ విషయంలో ఇప్పటికే చైనా, జపాన్ వంటి దేశాలు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయని అంటుండగా... త్వరలో మరిన్ని దేశాలు కూడా రెండు రకాల జనాభా సంక్షోభాలను ఎదుర్కోనునాయని అంటున్నారు. ఇందులో ఒకటి సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం కాగా.. మరొకటి వృద్ధ జనాభా పెరిగిపోవడం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తగ్గుతోన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు అభివృద్ధి చెందిన, చెందుతూ ఉన్న దేశాలకు అతిపెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. త్వరగా పెళ్లిల్లు చేసుకోకపోవడంతో పాటు.. మరికొంతమంది పిల్లలను కనే విషయంలో పూర్తిగా వెనకడుగు వేస్తున్నారని.. ఇంకొంతమంది ఒక్కరితోనే ఆపేస్తున్నారని.. ఇది పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత, అమెరికా అధ్యక్ష ఎనికల వేళ ట్రంప్ శ్రేయోభిలాషి అయిన ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పిల్లల పెంపకం విషయంలో అయ్యే ఖర్చుల గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారంటూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ధోరణి మానేసి, సంతోషంగా పిల్లల్ని కనడంపై దృష్టిపెట్టాలని మస్క్ సూచించారు. పెన్సిల్వేనియాలోని హారిస్ బర్గ్ లో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మస్క్.. పిల్లలను కనడం గురించి యువతరానికి ఏమి సలహా ఇస్తారు అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా... "పిల్లల్ని కనండి.. కుటుంబాన్ని పెంచుకోండి" అంటూ సమాధానమిచ్చారు. పిల్లలను కనే విషయంలోనూ, పెంచే విషయంలోనూ డబ్బు గురించి మరిచిపోండి.. త్వరగా పెళ్లి చేసుకోండి.. వీలైనంత ఎక్కువమంది పిల్లలను కనండి.. ఇది ప్రతీ ఒక్కరికీ తనవైపు నుంచి సలహా అని చెప్పుకొచ్చారు!

కాగా... ఎలాన్ మస్క్ కు 12 మంది సంతానం అనే సంగతి తెలిసిందే. అయితే... మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ ఆనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. ఇప్పుడు ట్రంప్ కు ఉన్న 11 మంది సంతానం కోసం ఇటీవల ఓ ప్రత్యేక భవనాన్ని కొనుగోలు చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News