మస్క్ మజా.. ఐదు రోజుల్లో 3 లక్షల కోట్ల సంపద!
కానీ, తాజాగా ఆయన చైనాతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్కసారి మస్క్ వ్యాపారాలు పుంజుకున్నారు.
''సిరి తావచ్చిన వచ్చును!'' అని పెద్దలు అన్నట్టుగా.. ప్రపంచ కుబేరుడిగా పేరొందిన టెస్టా అధినేత, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే ఆయన సంపద ఏకంగా రూ.3 లక్షల కోట్ల కు ఎగిసిపోయింది. దీంతో ఆయన ఒక్కడే కాదు.. ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా.. భారీ ఎత్తున లబ్ధి పొందారు. వాస్తవానికి కరోనా అనంతరం.. మస్క్ వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయి. ఒకే సారి వందల కోట్లు ఆవిరైన పరిస్థితి కూడా ఎదురైంది.
కానీ, తాజాగా ఆయన చైనాతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్కసారి మస్క్ వ్యాపారాలు పుంజుకున్నారు. వాస్తవానికి 37.3 బిలియన్ అమెరికన్ డాలర్లు.. మస్క్ సొంతం చేసుకున్నా రు. ఇది భారత కరెన్సీలో 3.12 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఇలా అమాంతం మస్క్ ఆదాయం పెరగడానికి దారితీసినవి రెండు ప్రధాన కారణాలు.
1) చైనాలో ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ సిస్టమ్‌ను అమలు చేసేందుకు ఆమోదం.
2) టెస్లా కార్లను త్వరలో అందుబాటు ధరలో తీసుకురావడం.
ఈ రెండు కారణాలతో సోమవారం ఒక్కసారిగా మార్కెట్లు పుంజుకుని మస్క్ సంపద 18.5 బిలియన్ డాలర్లు(1.8 లక్షల కోట్లు) పెరిగింది. మొత్తంగా మస్క్‌తోపాటు.. ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు.. షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా..భారీగా లబ్ధి పొందారు.