5 ల‌క్ష‌ల ఓట్ల‌లో వైసీపీ షేర్ ఎంత‌.. లెక్క‌తేలిందా?

రాష్ట్రంలో కీల‌క‌మైన పోలింగ్ జ‌రిగిపోయింది. అయితే.. లెక్క‌లు మాత్రం ఇంకా ప‌క్కాగా తెలియడం లేదు.

Update: 2024-05-27 02:30 GMT

రాష్ట్రంలో కీల‌క‌మైన పోలింగ్ జ‌రిగిపోయింది. అయితే.. లెక్క‌లు మాత్రం ఇంకా ప‌క్కాగా తెలియడం లేదు. ఎవ‌రు ఎలాంటి స‌ర్వే చేసినా.. తమ‌కు అనుకూలంగా ఉంద‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. కానీ.. ఎవ‌రికి ఎలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రోముఖ్య‌మైన ఓటు బ్యాంకు ఉద్యోగులు. వీరి ఓట్లు 5 ల‌క్ష ల 20 వేల వ‌ర‌కు ఉన్నాయి. వీటిలో 99 శాతం అంటే.. 4 ల‌క్ష‌ల 97 వేల ఓట్లు పోలైన‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు.

దీంతో ఈ ఉద్యోగుల ఓట్లే... అన్ని పార్టీల‌కూ కీల‌కంగా మారాయి. మ‌రీ ముఖ్యంగా రెండో సారి కూడా అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ కి ఈ ఓట్లు కీల‌కంగా మారాయి. దీంతో ఈ 4.97 వేల ఓట్ల‌లో త‌మ‌కు ఎన్ని ప‌డ్డాయి? అనేది వీరు లెక్క‌లు వేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. సుమారు 2.5 ల‌క్ష‌ల వ‌రకు ప‌డి ఉంటాయ‌ని చెబుతున్నారు. వీరంతా . త‌మ ప్రభు త్వంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్నార‌న్న‌ది వైసీపీ చెబుతున్న లాజిక్‌.

గ్రామ‌, వార్డు సచివాల‌యాల్లో 1.30 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ర‌ట‌రీ పోస్టుల‌ను తాము ఇచ్చామ‌ని వైసీపీ చెబుతోంది. ఇవి కాకుండా.. నాలుగు వేల వ‌ర‌కు.. కాలేజీల్లో, యూనివ‌ర్సిటీల్లో ఇచ్చిన పోస్టులు ఉన్నాయ‌ని అంటోం ది. అదేవిధంగా మ‌రో 18 వేల వ‌ర‌కు వైద్య కాలేజీల్లో డాక్ట‌ర్ల పోస్టుల ను కూడా భ‌ర్తీ చేశామ‌ని.. అంటున్నా రు. ఇక‌, ఆర్టీసీని ప్ర‌బుత్వంలో విలీనం చేశామ‌ని కాబ‌ట్టి 30 ల‌క్ష‌ల డ్రైవ‌ర్లు.. కండెక్ట‌ర్లు ఇత‌ర సిబ్బంది కూడా త‌మ‌కే వేశార‌ని లెక్క‌లు చెబుతున్నారు.

దీంతో మొత్తంగా ఉద్యోగుల ఓట్ల‌లోనూ త‌మ‌కు స‌గానికిపైగానే ద‌క్కుతాయ‌నివైసీపీ లెక్క‌లు వేసుకుంది. దీనిలో నిజం ఎంతో జూన్ 4వ తేదీ వ‌ర‌కు వేచి చూడాలి. కానీ, గ్రౌండ్ లెవిల్లో ప‌రిస్థితి చూస్తే.. ఆర్టీసీని విలీనం చేసినా.. వారికి ఇవ్వాల్సిన జీత భ‌త్యాల‌ను మాత్రం ప్ర‌భుత్వ ఉద్యోగుల స్తాయిలో పెంచ‌లేద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో నియ‌మించిన 1.30 ల‌క్ష‌ల మంది కూడా.. త‌మపై ఎన‌లేని భారం మోపుతున్నార‌ని గ‌తంలోనే నిర‌సనలు చేశారు. కాబ‌ట్టి వారు ఏమ‌ర‌కు వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌నే విష‌యం ప్ర‌శ్న‌గానే ఉంది. దీంతో ఎలా చూసుకున్నా నాలుగో వంతు ఓట్లు ప‌డితే.. అదే వైసీపీకి ఎక్కువ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News