ఏడు నెలల్లో 419 మరణశిక్షలు అమలు... తెరపైకి షాకింగ్ రీజన్స్!
అవును... మరణశిక్షలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ.. ఇరాన్ లో ఆందోళనకర స్థాయిలో ఇవి అమలవుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరణశిక్షలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగుతోంది. అసలు మరణశిక్ష అనేదే వద్దని కొన్ని దేశాలు వాదిస్తుండగా.. వర్ణించలేని తప్పు చేసిన వారి విషయంలో ఇంతకంటే పెద్ద శిక్ష ఈ లోకంలోలేదు కదా అని మరికొన్ని దేశాలు వాదిస్తున్నాయని అంటున్నారు. జాతీయ భద్రతకు ముప్పువాటింపచేసేవారికి ఇవే సారైన శిక్షలని మరికొందరు చెబుతుండగా… పాలకుల నిరంకుశత్వ వైఖరికి జాతీయ భద్రత అనే అంశాన్ని సాకుగా ఉపయోగించుకుంటూ ఈ శిక్షలు అమలుచేస్తున్నవారు మరికొంతమంది.
ఈ సమయంలో తాజాగా వెలుగులోకి వచిన నివేదికలు పలు దేశాల్లో ఆందోళనకర స్థాయిలో ఈ మరణశిక్షలు అమలవుతున్నాయని వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా... కీలక విషయాలు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సరాసరిన నెలకు 60 - 70 మరణశిక్షలు అమలవుతున్నాయని చెబుతుంది.
అవును... మరణశిక్షలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ.. ఇరాన్ లో ఆందోళనకర స్థాయిలో ఇవి అమలవుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే సుమారు 419 మందికి ఇరాన్ దేశం మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 30 శాతం ఎక్కువని తెలిపింది. ఇక్కడ ప్రతీ ఏటా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.
ఈ క్రమంలో ఈ మరణశిక్షలు, అందుకు సదరు నేరస్తులు అత్యధికమంది చేసిన శిక్షలు మొదలైన విషయాలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తాజాగా సభ ముందుంచారు. అవును... ఇరాన్ లో మానవహక్కుల పరిస్థితులకు సంబంధించిన తాజా నివేదికను ఆంటోనియో గుటెరస్ సభ ముందు ఉంచారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్ష విధించిందని తెలిపారు. ఇందులో 7మంది హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వారేనని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఈ హిజాబ్ వ్యతిరేక ఆందోళనల సమయంలో నమోదైన కేసుల విచారణల్లో పారదర్శకత, స్వతంత్ర దర్యాప్తు జరగలేదని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో... నిరసనల సమయంలో సుమారు 20వేల మంది సామాన్యులను అరెస్టు చేసి నిర్బంధించినట్లు తమకు సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఇలా అరెస్టైన వారిలో ఎక్కువగా 15ఏళ్ల వయసు వారే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఈ మరణశిక్ష పడిన 419 వారిలో 239 మంది మాదక ద్రవ్యాల నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఇలా మాదక ద్రవ్యాల కేసులు గతేడాదితో పోలిస్తే 98 శాతం పెరిగాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చెప్పారు.
మరిముఖ్యంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో మహిళలు, జర్నలిస్టులు, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేసినట్టు ఆయన తెలిపారు. ఇంత దారుణంగా జరుగుతున్న ఈ మరణశిక్షలను జాతీయ భద్రత అంటూ ఇరాన్ సమర్థించుకోవడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.